Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vaaram varaam vari vari varaphalalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

6-4-2018 నుండి12-4-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద కొంత స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండకపోతే ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నూతన ఒప్పందాల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ కూడదు, ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కలదు. అనుకోకుండా చేసే ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. స్త్రీ సంభందమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. నూతన ఉద్యోగప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయాల గురుంచి ఆలోచన చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలకు అవకాశం ఉంది, వారిసూచనల మేర ముందుకు వెళ్ళండి. సోదరులతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. దైవపరమైన పూజల్లో పాల్గొంటారు. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారము ఉంది, వారం చివరలో గతంలో చేపట్టిన పనులకు గాను ఆశించిన మేర ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. మిత్రులను కలుస్తారు.  


మిథున రాశి : ఈవారం మొత్తం మీద ఎవ్వరితోను మాటపట్టిములకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం మంచిది. నలుగురిలో సంతానం వలన గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన వీసీహాయాల్లో బాగానే ఉంటుంది. చర్చల్లో చురుగా పాల్గొంటారు , కాకపోతే వివాదాలకు దూరంగా ఉండేలా ప్రయత్నం చేయుట మంచిది. జీవితభాగస్వమితో మీ ఆలోచనలను తెలియజేస్తారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ఉద్యోగంలో కాస్త పనిఒత్తిడి పెరుగుటకు ఆస్కారం కలదు. మానసికంగా దృడంగా ఉండుట. సంయానైకి అనుగుణంగా ఆలోచన చేయుట వలన తప్పక మేలుజరుగుతుంది.
 

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద కుటుంబంలో పెద్దల నుండి సూచనలు వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఎవ్వరికి మాటఇవ్వకపోవడం మంచిది. ముఖ్యమైన పనులకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభించే ఆస్కారం కలదు. జీవితభాగస్వామితో ఊహించని విధంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం ఉంది , కాస్త సర్దుకుపోవడం వలన మేలుజరుగుతుంది. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. గతంలో మీరు తీసుకున్న ధనంకు సమాధానం చెప్పాల్సి వచ్చే ఆస్కారం ఉంది, సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకోండి , సూచన.

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. సోదరులతో చేపట్టిన చర్చలు పూర్తిఅయ్యేఅవకాశం కలదు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుతాయి. సంతానం గురుంచి ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారితో సమయాన్ని గడుపుతారు. వ్యాపారపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు , పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళుట మంచిది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. విందులల్లో పాల్గొంటారు.

 

 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సభ్యులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానంతో సమయం గడుపుతారు, వారై సూచనలకు లేదా ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశమా ఉంది , కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వారం చివరలో మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు.

 

తులా రాశి :  ఈవారం మొత్తంమీద ముఖ్యమైన పనులకు సమయం ఇవ్వడం మంచిది. మీ ఆలోచనల వలన నూతన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబసభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. పెద్దల నుండి వచ్చిన సూచనల విషయంలో విభేదించే ఆస్కారం ఉంది. జీవితభాగస్వమిటో ఉన్న విభేదాలు మరింతగా పెరిగే ఆస్కారం కలదు. నూతన ఉద్యోగప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్రాతపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన తప్పక మేలుజరుగుతుంది, నిదానం అవసరం.

 

వృశ్చిక రాశి :ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలు చాలామందికి నచ్చకపోవచ్చును. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో మీకు ఉన్న పరిచయాలు మీకు ఉపయోగపడుతాయి. అనుకోకుండా చేసే ప్రయాణాలు తప్పక లబ్దిని కలుగజేస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి సహకారం లభిస్తాయి. జీవితభాగస్వామితో వివాదాలు రాకుండా సర్దుబాటు విధానం మంచిది. మీకురావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు అవకాశం ఉంది.
 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారులతో కలిసి సమయాన్ని గడుపుతారు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ మాటతీరు చాలామందికి నచ్చకపోవచ్చును, కొన్ని కొన్ని విషయాల్లో సమయానికి అనుగుణంగా ముందుకు వెళ్ళుట మంచిది. ఆత్మీయుల ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో పెద్దలనుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఊహించని ఖర్చులకు అవకాశం కలదు, తగ్గించుకొనే విషయంలో మీ ప్రయత్నాలు విఫలం అయ్యే ఆస్కారం ఉంది. మిత్రులతో చర్చలకు అవకాశం ఇవ్వకండి.

 

 

మకర రాశి : ఈవారం మొత్తం మీద నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది, ఆశించిన మేర నూతన అవకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, నూతన పెట్టుబడులు లభిస్తాయి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతాన పరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు అవసరం అయితేనే ప్రయాణాలు చేయుట సూచన. ఆరోగ్యం విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. జీవితభాగస్వామితో కలిసి నూతన ఆలోచనలు    చేయుటకు ఆస్కారం ఉంది. స్థిరాస్తి కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యం అయినా విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో స్పష్ష్టమైన ఆలోచన కలిగి ఉండుట మంచిది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అలాగే సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రాతపరమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు  మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. వైద్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. రుణపరమైన విషయాల్లో కాస్త నిదానం అవసరం.
 

మీన రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారితో కలిసి చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువులను కలుస్తారు, వారితో కలిసి ముఖ్యమైన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులు పెరుగుటకు ఆస్కార్మ్ ఉంది , కాస్త జాగ్రత్తగా ఉండుట మంచిది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు , సమయాన్ని సరదాగా గడుపుతారు.

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment