Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

భరత్ అనే నేను చిత్రసమీక్ష

bharat ane nenu movie review

చిత్రం: భరత్‌ అనే నేను 
తారాగణం: మహేష్‌బాబు, కైరా అద్వానీ, ప్రకాష్‌ రాజ్‌, శరత్‌కుమార్‌, రమాప్రభ, దేవరాజ్‌, ఆమని, సితార, పోసాని కృష్ణమురళి, రవిశంకర్‌, జీవా, యశ్‌పాల్‌ శర్మ, రావు రమేష్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్‌ 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
దర్శకత్వం: కొరటాల శివ 
నిర్మాతలు: డివివి దానయ్య 
నిర్మాణ సంస్థ: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 20 ఏప్రిల్‌ 2018 
క్లుప్తంగా చెప్పాలంటే 
తండ్రి (శరత్‌బాబు) మరణంతో లండన్‌ నుంచి స్వదేశానికి వస్తాడు భరత్‌ రామ్‌. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో ఆయన హఠాన్మరణం తర్వాత, పార్టీ భరత్‌ రామ్‌ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడుతుంది. యువ నేత ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడంటే, అది ప్రజలకు భరోసాగా వుండాలని గట్టిగా నమ్ముతాడు భరత్‌ రామ్‌. ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం రకరకాల మార్గాల్ని అన్వేషిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో సహజంగానే అతనికి సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను అధిగమించి, ముఖ్యమంత్రిగా భరత్‌ రామ్‌ ప్రజలకు ఎలాంటి పాలన అందించాడు? అతనెదుర్కొన్న సమస్యలు ఎలాంటివి? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూస్తేనే బావుంటుంది. 
మొత్తంగా చెప్పాలంటే 
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మరోమారు తన నటతో ఆకట్టుకున్నాడు. నటుడిగా విశ్వరూపం అనదగ్గ స్థాయిలో ఎమోషన్స్‌ పండించాడు. హావభావాలు, డైలాగ్స్‌ పరంగా అద్భుతః అనిపించాడు మహేష్‌. ఈ పాత్రలో మహేష్‌ని తప్ప ఇంకెవర్నీ ఊహించుకోలమన్పించేలా భరత్‌ రామ్‌ పాత్రలో మహేష్‌ ఒదిగిపోయి తీరు సింప్లీ సూపర్బ్‌. మహేష్‌ కటౌట్‌, ముఖ్యమంత్రి పదవికి కొత్త గ్లామర్‌ తెచ్చిందనడం అతిశయోక్తి కాదేమో. 
హీరోయిన్‌ కియారా అలియా అద్వానీ తొలి సినిమానే అయినా ఆకట్టుకుంది. మహేష్‌కి జోడీగా బాగా సెట్టయ్యింది. గ్లామరస్‌గానూ కన్పించింది. తెలుగు తెరపై స్టార్‌ హీరోయిన్‌గా ఆమె పేరు దాదాపుగా స్థిరపడిపోయినట్లే. అదీ తొలి సినిమాతోనే. ప్రకాష్‌రాజ్‌ తనకు కొట్టిన పిండి లాంటి పాత్రలో అలా అలా చేసుకుపోయారంతే. రావు రమేష్‌ నటన ఆకట్టుకుంటుంది. దేవరాజ్‌ తదితరులు బాగా చేశారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా నటించారు. 
కథ కొత్తదేమీ కాదు. 'లీడర్‌' సినిమాలో చూసేసిందే. కథనం పరంగా, సన్నివేశాల పరంగా ఎమోషన్స్‌ పండిన తీరు ప్రత్యేకంగా అన్పిస్తుంది. అన్నిటికీ మించి, మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని దర్శకుడు మలిచిన తీరు మాస్‌ ఆడియన్స్‌ని అలరిస్తుంది. మాటలు బాగున్నాయి, స్క్రీన్‌ప్లే ఓకే. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ సైతం సినిమాకి మేజర్‌ ప్లస్‌ పాయింట్‌. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఆద్యంతం సినిమాలో రిచ్‌నెస్‌ కన్పిస్తుంది. ఆ రిచ్‌నెస్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 
ఫస్టాఫ్‌ ఇంట్రెస్టింగ్‌గా, వేగంగా సాగిపోతుంది. సెకెండాఫ్‌కి వచ్చేసరికి అక్కడక్కడా కొంత గ్రాఫ్‌ తగ్గినట్లు అన్పిస్తుంటుంది. ఆ వెంటనే ఓ బలమైన సన్నివేశంతో సినిమాలో పేస్‌ని పెంచుతాడు దర్శకుడు. దానికి మహేష్‌ నటన తోడై, అనూహ్యంగా సినిమాలో పేస్‌ పెరిగిపోతుంటుంది. సెకెండాఫ్‌లో చిన్న చిన్న లోటుపాట్లు మినహాయిస్తే, సినిమా మొత్తంగా ఓ మంచి ఫీల్‌ని మిగుల్చుతుంది. ఆలోచింపజేస్తుంది. క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ పడ్డ సీన్స్‌ చాలా ఎక్కువ వుండడంతో అవన్నీ సినిమాకి రిపీట్‌ ఆడియన్స్‌ని బాగా రప్పిస్తాయి. క్లాస్‌ సెంటర్స్‌లో మహేష్‌కి వున్న ఇమేజ్‌, మాస్‌ సెంటర్స్‌కి తగ్గట్టుగా సినిమాలో సన్నివేశాలు వెరసి, ఈ సినిమాని సూపర్‌ హిట్‌గా మలచే అవకాశాలు సుస్పష్టం. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
భరత్‌ రామ్‌ మెజార్టీ సాధించేశాడోచ్‌ 
అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

భరత్ అనే నేను చిత్ర విశేషాలు....ఆసక్తికరమైన కథనాల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.....

http://www.ratingdada.com/983/bharat-ane-nenu-movie-review-rating

మరిన్ని సినిమా కబుర్లు
churaka