మేష రాశి : ఈవారం మొత్తంమీద తీసుకొనే నిర్ణయాల విషయంలో తొందరపాటు లేకపోవడం వలన ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యసమస్యలు మిమ్మల్ని భాధకు గురిచేస్తాయి. కావున సమయానికి భోజనం చేయుట, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. కుటుంబంలో సభ్యుల నుండి నూతన విన్నపాలు వస్తాయి వాటి విషయంలో బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట మేలు. మీయొక్క మాటతీరు మార్చుకోకపోతే నూతన సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళండి. అధికారుల నుండి మాత్రం ఆశించిన గుర్తింపును పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మేలు. పూజసంబంధమైన విషయాల్లో సమయాన్ని గడపడం అనేది మంచిది.
వృషభ రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులలో సానుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యంగా నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్న అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. సోదరసంబంధమైన విషయాల్లో శుభకార్యక్రమాలకు అవకాశం ఉంది. మీయొక్క మాటతీరు మూలాన తోటివారు కాస్త ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది కావున ఇతరులను ఇబ్బంది పెట్టె పనులను చేయకండి అలాగే మాటతీరు విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. మిత్రులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వాహనముల మూలాన అనుకోని ఖర్చులు పెరుగుతాయి అగ్నిసంబంధమైన పనుల విషయంలో నిదానంగా వ్యవహరించుట మంచిది.
మిథున రాశి : ఈవారం మొత్తంమీద నూతన నిర్ణయాలు చేపట్టుటకు అవకాశం ఉంది. గత కొంత కాలంగా మిమ్మల్ని ఊరిస్తున్న విషయంలో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా సమయానికి భోజనం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. స్త్రీ / పురుష సంబధమైన విషయాల్లో మాత్రం వివాదాలకు తావివ్వకుండా ఉండుట మేలు. దూరప్రదేశాల నుండి సంతోషించే వార్తలను వింటారు. అధికారుల నుండి చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతాయి సర్దుకుపోవడం వలన మేలుజరుగుతుంది. సంతానపరమైన విషయల్లో కోత్త కొత్త మార్పులు జరిగే అవకాశం ఉంది.
కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తుల నుండి వచ్చిన సూచనల విషయంలో ఆలోచనలు పడుతారు. సమయాన్ని సరదాగా గడుపుటకు ఆసక్తిని చూపిస్తారు. రాజకీయరంగాల్లోని పెద్దలతో సమయాన్ని గడుపుతారు వారినుండి ఊహించని విధంగా సహకారాన్ని పొందుతారు. కుటుంబంలో అనుకోని ఖర్చులు కలుగుతాయి కావున సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. సంతానం విషయంలో వారి ఆలోచనలు వినే ప్రయత్నం చేయుట అలాగే వారికి అనుగుణంగా నడుచుకొనుట మేలు. నూతన పనులను ఆరంభించుట యందు ఉత్సుకత ఉంటుంది. సోదరసంబంధమైన విషయాల్లో వారితో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు.
సింహ రాశి : ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వాటిని పూర్తిచేసే విషయంలో మంచి ప్రణాళిక కనుక కలిగి ఉన్నచో స్వల్ప ప్రయత్నం ద్వార అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చును. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఆశించిన విధంగా పెద్దలనుండి సహకారం లభిస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో మాటపట్టింపులకు పోకండి సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అగ్నిసంబంధమైన వస్తువులతో పనిచేసే సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. అధికారులతో మాటపట్టింపులకు పోకండి వారికి అనుగుణంగా నడుచుకోవడం ఉత్తమం. దైవసంభందమైన విషయాలకు సమయాన్ని కేటాయిస్తారు.
కన్యా రాశి : ఈవారం మొత్తంమీద చర్చాసంబంధమైన విషయాలకు సమయాన్ని కేటాయిస్తారు. పెద్దలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వలన గత కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో బాగుంటుంది నూతన అవకాశాలు వస్తాయి. ప్రణాళికాబద్దంగా వ్యవహరించుట వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. దగ్గరిప్రదేశాలు సందర్శించే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. అలాగే బంధువుల నుండి ఆశించిన సహకారం ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట అవసరం. లేకపోతే వాటిని నష్టపోయే అవకాశం ఉంది. మీరు గతంలో చేపట్టిన పనులకు గాను సమాజంలో మంచి పేరును తెచ్చుకొనే అవకాశం ఉంది.
తులా రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో తల్లితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోవడం మూలాన అనుకోని సమస్యలు ఏర్పడతాయి జాగ్రత్త. పెద్దలతో కలిసి పనిచేసే సమయంలో లేక చర్చల్లో మీ ఆలోచనలు వారికి అనుగుణంగా ఉండటం మేలు. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ఇబ్బందులు తెలెత్తు తాయి. కాబట్టి ఈ విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. దూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవచ్చు, కావున వేచిచూసే దోరణి చాలావరకు మంచిది. జీవితభాగస్వామి ఇచ్చే సూచనలు స్వీకరించుట మంచిది.
వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద పనుల విషయంలో ఒత్తిడి పొందుతారు పెద్దల సూచనల మేర నడుచుకోండి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో నూతన చర్చలు చేయుటకు అవకాశం ఉంది. కొత్త కొత్త అవకాశాలు పొందుతారు. స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు. సోదరసంబంధమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపరమైన విషయాల్లో సంతోషకరమైన వార్తలను వినే అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి వచ్చే వార్తలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. అధికారులతో కలిసి నూతన పనుల గురుంచి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి మాట్లేడటప్పుడు కాస్త వారి ఆలోచనలను గమనించి దానికి అనుగుణంగా నడుచుకోండి.
ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో లేక పనిలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పెద్దలతో చేసిన చర్చలు సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి. బంధువర్గం నుండి అనుకోని వార్తలను తెలుసుకుంటారు . అనవసరమైన విషయాలకు సమయం ఇవ్వకండి. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం కోసం అనుభవం అవసరం అని గమనిస్తారు. దానిని పాటించుట ఉత్తమం. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి, వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట, అలాగే చాలావరకు దూరంగా ఉండుట మంచిది. కుటుంబంలో పెద్దలనుండి నూతన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున మీ మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నిదానం అవసరం.
మకర రాశి :ఈవారం మొత్తంమీద తలకు మించిన భారం పెంచుకోవడం వలన తిప్పలు తప్పకపోవచ్చును. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవసరమైతే వాయిదా వేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞులను సంప్రదించుట మేలు. ఉద్యోగపరమైన విషయాల్లో కాస్త శ్రమించుట చేత ఆశించిన ఫలితాలను పొందే ఆస్కారం ఉంది. సోదరసంబంధమైన విషయాల్లో బాగా ఆలోచనలుచేస్తారు. అలాగే వారితో చర్చలు చేపడతారు. వ్యతిరేకవర్గం నుండి వచ్చే ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. విలువైన వస్తువుల విషయంలో ఆసక్తిని చూపిస్తారు. సామజికపరమైన విషయాల్లో పాల్గొనేటప్పుడు మీకంటూ ఒక విధానం ఉండుటం అనేది అవసరం, ఆ దిశగా ఆలోచనలు చేయండి.
కుంభ రాశి : ఈవారం మొత్తంమీద సంతానం మూలాన అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థుల్లో నూతన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వీటిమూలన చిన్న చిన్న ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికరంగ విషయాల్లో మీయొక్క ఆలోచనలు మిమ్మల్ని ఆత్మరక్షణలో పడవేసే అవకాశం ఉంది జాగ్రత్త. విలువైన వస్తువులను కోల్పోయే ప్రమాదం కలదు. ఉద్యోగంలో అధికారులతో చర్చలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. అనవసరమైన మాటపట్టింపులకు పోకండి. మీయొక్క ఇష్టాలపట్ల మక్కువను కల్గి ఉంటారు. నూతన ప్రయత్నాల విషయంలో అనుభవజ్ఞులతో కలిసి పనిచేయుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీతిమూలన స్వల్ప ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడుతాయి.
మీన రాశి : ఈవారం మొత్తంమీద మీయొక్క మాటతీరు విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినను ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. సోదరసంబంధమైన విషయాల్లో మనస్పర్థలు ఏర్పడుటకు అవకాశం ఉంది కావున వీలైనంత వరకు సర్దుబాటు విధానం అవసరం. ప్రయాణాలు చేయకండి వాయిదా వేయుట మేలు. విదేశాల నుండి ఆశించిన సమాచారం లభిస్తుంది. గతంలో మీరుమిత్రుల నుండి సేకరించిన విషయాలు మీకు లబ్దిని చేకూర్చేవిగా ఉంటవి. వ్యాపారపరమైన లావాదేవీల విషయంలో అనుభవజ్ఞుల సూచనలు పాటించుట మేలు.
|