Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

*her. షార్ట్ ఫిల్మ్- - పి.వి.సాయి సోమయాజులు

*her.  short flim

`మధురం’, ‘బ్యాక్‍స్పేస్’ వంటి క్లాసిక్ షార్ట్ ఫిల్మ్స్ తీసిన ఫణీంద్ర నార్సెట్టి, హీరోయిన్ రెగినా తో తీసిన షార్ట్ ఫిల్మ్- *her. తెలుగువాళ్లందరినీ, ముఖ్యంగా, సినీ ప్రేమికులని అలరిస్తూ వస్తున్న వెబ్‍సైట్- చాయ్ బిస్కెట్ ద్వారా విడుదలైన ఈ లఘుచిత్రం సమీక్ష, మీ కోసం-

 

కథ:

హీరోయిన్ రెజీనా కారు అనుకోకుండా బ్రేక్ డౌన్ అవ్వడంతో, వెయిట్ చేస్తున్న తన దగ్గరికి ఓ ఫ్యాన్ వస్తాడు. సెల్ఫీ తీసుకోగానే, రెజీనా తో జరిగే సంభాషణ, హీరోయిన్ల పట్ల.. అమ్మాయిల పట్ల ..తను ఆలోచన ధోరణిని మార్చేస్తుంది. అది ఎంటో తెలుసుకోవాలంటే, మీరు ‘*హర్’ చూడాల్సిందే!

 

ప్లస్ పాయింట్స్ :

ఒక హీరోయిన్ గాసిప్స్ కి ఎలా ఫీల్ అవుతుందో, వాటి వల్ల తన పర్సనల్ లైఫ్ ఎలా దెబ్బతింటుందో సింపుల్‍గా.. క్లియర్‍గా చూపించాడు దర్శకుడు. అలానే, ఒక అబ్బాయి, క్రియేటివ్ ఫీల్డ్ లో పని చేసే అమ్మాయిల పట్ల ఎలా ఆలోచిస్తాడో, ఎలా ఆలోచించాలో కూడా చాలా బాగా చెప్పారు. ఈ సినిమాకి వార్మ్-టోన్ చాలా బాగా సూట్ అయ్యింది. రెజీనా నటన గురించి కొత్తగా ఏం చెప్పకర్లేదు. తన పాత్రను చాలా న్యాచురల్‍గా లాగించేసింది. ఈ సినిమా, మొత్తంగా తన భుజాలపైనే మోసిందని చెప్పుకోవచ్చు! డైలాగ్స్ చాలా సింపుల్‍గా ఉన్నప్పటికీ, కథను ముందుకు తీసుకెళ్ళడానికి మంచి ఆసరానిస్తుంది. ఎండ్ క్రెడిట్స్ చాలా క్రియేటివ్‍గా డిజైన్ చేశారు. రెజినా నటించినందుకుగాను, ఈ సినిమాకి మంచి ఔట్‍రీచ్ లభిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ‘సందీప్’ పాత్ర ధరించిన నటుడు చాలా పూర్‍గా నటించాడు. అతని డబ్బింగ్ కూడా ఆర్టిఫీషియల్‍గా అనిపిస్తుంది. పాత్ర బాగున్నప్పటికీ, నటన పరంగా అతను అస్సలు జస్టిస్ చెయ్యలేకపోయాడనే చెప్పుకోవాలి. కొద్ది నిమిషాలలోనే ఓ సెలెబ్రిటీతో పర్సనల్ టాపిక్స్ మీద మాట్లాడడం అన్నది కొంచెం సూపర్‍ఫీషియల్‍గా అనిపించొచ్చు. అలాగే, సంభాషణ జరిగే ప్రక్రియని గనక గమనిస్తే, డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని ఒక దాని తర్వాత ఒకటి వెంటనే చూపించాలన్న తొందర కనపడుతుంది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్-డ్రమెటిక్‍‍గా అనిపిస్తుంది.
 

 

సాంకేతికంగా :

కెమెరా వర్క్ బానే ఉన్నప్పటికి, మాటిమాటికీ షాట్స్ బ్యాక్ ఎండ్ ఫోర్త్ కట్ అవ్వడం ఇరిటేట్ చేస్తుంది. ఎడిటింగ్‍లో ఆకట్టుకునే విషయం కలర్ గ్రేడింగ్. చక్కని వార్మ్ టోన్ ఈ సినిమాకి మంచి లుక్ ఇస్తుంది. నిడివి పర్ఫెక్ట్! దర్శకత్వ పరంగా బాగున్నప్పటికీ, ఫణీంద్ర తీసిన లఘు చిత్రాలన్నిటి స్టాండర్డ్ కి సమానంగా అయితే అనిపించదు! ప్రొడక్షన్ వాల్యూస్‍కి పెద్దగా స్కోప్ లేని కథ అయ్యుండడం వల్ల ఏం కామెంట్ చెయ్యలేము! సందీప్ పాత్ర డబ్బింగ్ పై శ్రద్ద పెట్టుండాల్సింది.

 

 

మొత్తంగా :

WATCH IT FOR *HER.

 

అంకెలలో:

3.5/5

 

 

LINK-
https://www.youtube.com/watch?v=y3pIQVYDpiM
 

 

మరిన్ని శీర్షికలు
only one thing