'బాబాయ్ ఇంకొంచెం మసాలా..' ఏదైనా జరగొచ్చు అంటూ బిగ్‌బాస్ హోస్ట్ నాని మొదట్నుంచీ చెబుతూ వస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే మసాలా ఎలిమెంట్స్ బిగ్‌బాస్‌లో బాగానే చోటు చేసుకుంటున్నాయి. భాను, తేజు హౌస్‌లో ఉన్నంత కాలం ఎలాంటి మసాలా అంశాలు జరిగాయో ప్రత్యక్షంగా చూసేశాం. అలాగే ఎలిమినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్‌లు జరుగుతున్నాయి. గతవారం నో ఎలిమినేషన్. ఎక్స్‌ట్రాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పూజా రామచంద్రన్ హౌస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ వారం అప్‌డేట్ ఏంటంటే, ప్రేక్షకుల మద్దతు మేరకు అత్యధిక ఓట్లు గెలుచుకుని ఎక్స్ పార్టిసిపెంట్స్ శ్యామల, నూతన్ నాయుడు హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఈ విషయాన్ని నాని కన్‌ఫామ్ చేసేశాడు కానీ, వీరింకా హౌస్‌లోకి ఎంటర్ కాలేదు. ఎనీ టైమ్ వీరి ఎంట్రీ ఉంటుందని నాని ఆడియన్స్‌కి చెప్పాడు. అది ఈ గురు, శుక్ర వారాల్లో ఏదో ఒక రోజు ఉండే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ఇకపోతే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేనందున ఈ వీక్ ఇద్దరి ఎలిమినేషన్ ఉండొచ్చని వీక్షకులు భావిస్తున్నారు. అయితే ఏం జరుగుతుందనేది ఊహించలేం. ప్రస్తుతం ఎలిమినేషన్ జోన్‌లో, గణేష్, నందిని, కౌషల్, దీప్తి, బాబు గోగినేని ఉన్నారు. వీరిలో కౌషల్‌కి మాత్రం ప్రేక్షకుల నుండి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. 'కౌషల్ ఆర్మీ' పేరుతో సోషల్ మీడియాలో కౌషల్‌కి సపోర్టింగ్‌గా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు, ఇకపోతే బాబు గోగినేనిపై ఇటీవల నెలకొన్న కేసుల కారణంగా ఆయన బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇకపోతే నందిని, దీప్తి, గణేష్‌లలో ఓట్ల పరంగా గణేష్, నందిని వీక్‌గా ఉన్నారు. చూడాలి మరి, ఇది బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు.
|