దర్శకులందు మారుతి దర్శకత్వం వేరయా అనాల్సి వస్తోంది. ఎందుకంటే అడల్ట్ కంటెన్ట్ మూవీస్‌తో పాపులరైన ఈ దర్శకుడు ఆ తర్వాత 'హీరోకి లోపం' అనే ఓ కొత్త ఫార్ములా కనిపెట్టి యూత్ పల్స్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్‌ని కూడా బాగా పట్టేశాడు. 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో మొదలైన మారుతి 'లోపం' ఫార్ములా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ కొత్త ఫార్ములాతో వరుస సక్సెస్‌లు అందుకుంటూ, జోరు ప్రదర్శిస్తున్నాడు డైరెక్టర్ మారుతి. తాజాగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అత్త పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. ఇంతకీ మారుతి ఈ సినిమాలో ఏం లోపం పెట్టాడనే కదా మీ అనుమానం, ఆశక్తి. ఈ సినిమాలో హీరోయిన్‌కి ఈగో. అంతకు మించిన ఈగో హీరోయిన్ తల్లిది. ఈ ఇద్దరు ఈగో తల్లీ కూతుళ్ల మధ్య నలిగిపోయే హీరో హావభావాల నుండి పుట్టే కామెడీనే ప్రేక్షకులకు అసలు సిసలు వినోదం. లేటెస్టుగా విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈగో, దర్పం, పొగరు తదితర హావభావాలను ప్రదర్శించడంలో రమ్యకృష్ణ తర్వాతే ఇంకెవరైనా. అలాంటి పాత్రల్లో ఆమెకున్న ఎక్స్‌పీరియన్స్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మారుతి మార్క్‌లో రమ్యకృష్ణ దర్పాన్ని ఏ రేంజ్‌లో చూపించాడో తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంద.ఇ
|