సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రంలోని ఓ సాంగ్ కోసం విజయ్ దేవరకొండ తొలిసారి తన గొంతు సవరించుకున్నాడు. విజయ్ దేవరకొండ స్వీయ గానంలో రూపొందిన ఈ సాంగ్‌ని ఇటీవలే చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. విడుదలైన కాస్సేపట్లోనే సాంగ్‌లోని కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ, అస్సలు పాట కూడా ఏమీ బాగా లేదంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ వ్యూస్ వచ్చేశాయి. దాంతో వెంటనే ఆ పాటని యూ ట్యూబ్ నుండి తొలిగించేశారు. ఆ తర్వాత పాటలోని అభ్యంతరకర పదాలను తొలగించి మళ్లీ సరిచేశారు.
అయితే ఈ వివాదాన్ని వివాదంగా కాకుండా చాలా చాకచక్యంగా సర్దేశాడు మన విజయ్ దేవరకొండ. ఎవ్వరి మనోభావాల్ని కించపరచాలని మేం అనుకోవడం లేదు అంటూనే అభిమానులకు ఓపెన్ ఆఫర్ ఒకటి సంధించాడు. అదే పాటను, అందులోని పదాలు మార్చి, స్వయంగా ఆలపించిన వీడియోలను పంపించమన్నాడు. వాయిస్ నచ్చితే అదే సాంగ్‌ని సినిమాలో పెట్టుకుంటామనీ చెప్పాడు విజయ్ దేవరకొండ. అలా ఈ వివాదాన్ని కూడా సెన్సేషనల్ చేసేశాడు. దాంతో పాటు సినిమా పబ్లిసిటీకి కూడా బాగా యూజ్ చేసేసుకున్నాడు. ఇకపోతే ఇటీవల జరిగిన 'గీత గోవింద' చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆ వేడుకకు స్లైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశించాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఛలో' బ్యూటీ రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
|