బాలయ్య ప్రధాన పాత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎన్టీఆర్'. తేజ చేతి నుండి, క్రిష్ చేతికి చిక్కిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పరుగులు పెడుతోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నటీనటుల ఎంపిక తదితర అంశాలు కూడా దాదాపు ఓ కొలిక్కి వచ్చేసినట్లే. బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ భార్య 'బసవతారకం' పాత్రను పోషిస్తోంది విద్యాబాలన్. ఇటీవలే సెట్స్‌లోకి అడుగుపెట్టింది విద్యాబాలన్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెష్ అప్‌డేట్ ఏంటంటే, 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు టచ్ చేయొచ్చని భావిస్తున్నారు.
ఇంతవరకూ అందిన సమాచారమ్ ప్రకారం 80 కోట్ల వరకూ బిజినెస్ ఆఫర్ వచ్చిందనీ తెలుస్తోంది. ఇది మరింత పెరిగి, 100 కోట్లను టచ్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ అంటే కేవలం తెలుగువారికే కాదు, హిందీ, తమిళ ప్రజలకు కూడా సుపరిచితుడే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతో బాలయ్య తొలిసారి నిర్మాతగా మారారు. పలువురు ప్రముఖ నటీనటులను, ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని ఇతర ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేసుకుంటున్నారు. కైకాల సత్యనారాయణ తాజాగా ఈ లిస్టులో యాడ్ ఆయ్యారు. ఇప్పటికే, మోహన్‌బాబు, నాగచైతన్య, మహేష్‌బాబు, మురళీశర్మతో పాటు, పలువురు సీనియర్ మరియు జూనియర్ నటీనటుల్ని ఈ బయోపిక్ కోసం ఎంపిక చేస్తున్నారు.
|