Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

‘లైఫ్’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - -సాయి సోమయాజులు

life short flim review

అతి తక్కువ టైంలో ఓ కథ చెప్పి అలరించడమన్నది చాలా కష్టమైన పని. ‘లైఫ్’ అన్న ఈ సైలెంట్ లఘు చిత్రం ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కి అఫీషియల్‍గా నామినేట్ అవ్వడమే కాకుండ, యూట్యూబ్ లో చోటు చేసుకుని ఎన్నో మనసులను గెలుచుకుంది. ఈ చిత్ర సమీక్ష, మీ కోసం. 

కథ:
మన సమజంలో ఒక సమస్యని రకరకాల వ్యక్తులు వాళ్ల వాళ్ల వ్యక్తిత్వాలతో ఎలా ఎదురుకుంటారన్నదే ఈ కాన్సెప్ట్. రోడ్డు పై బురుద ఉండడం వల్ల ఓ ముగ్గురు దానిని ఎలా దాటతారు అన్నది ఓ మెటాఫర్ ద్వారా దర్శకుడు మనకి చూపిస్తాడు.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ రన్ టైమ్. రెండున్నర నిమిషాలకంటే తక్కువ నిడివి తో సుత్తి లేకుండా చెప్పాల్సింది చెప్పేసారు. స్క్రీన్ టైం తక్కువున్నప్పటికీ ఈ సినిమాలో కనిపించే ముగ్గురూ బానే చేశారు. అన్నిటికంటే మించి ఈ సినిమా ద్వారా సొసైటీకి లభించే మెసేజ్ అభినందనీయం. 

మైనస్పాయింట్స్ :
కెమెరా హ్యాండ్లింగ్ ఏ మాత్రం కొత్తగా లేకపోవడం మైనస్. ఫ్రేమింగ్ కూడా బాగుండొచ్చు. ఇదే కథని టెక్నికల్‌గా ఇంకా ఎంతో బాగా ప్రెజెంట్ చేసుండొచ్చు. రచనాపరంగా కూడా ఇంకా స్మార్ట్ గా రాసుండొచ్చు. 

సాంకేతికంగా :
ఎడిటింగ్ ఇంకా చాలా బాగుండొచ్చు. ముగ్గురి మధ్య కాంట్రాస్ట్ విజువల్‌గా చాలా బాగా చూపించే స్కోప్ ఉంది. సినిమా నిడివి తక్కువగా ఉన్నప్పటికి అనవసరమైన కొన్ని సెకండ్స్ ని ఇంకా ట్రిం చేసే చాన్స్ ఉంది. కెమెరా వర్క్ బిలో యావరేజ్ అనే చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ.కె. 

మొత్తంగా :
ఓ రెండు నిమిషాలు టైం తీసుకుని చూసేయండి! 

అంకెలలో:
3.5 / 5

LINK-
https://www.youtube.com/watch?v=mWZ6b_I-Djg

 

మరిన్ని శీర్షికలు
Pulasa Fish Curry - Most expensive fish in the world