కావలిసిన పదార్ధాలు: పులస ఫిష్ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, కొబ్బరినీళ్ళు, చింతపండు, కారం, ఉప్పు, పసుపు, నూనె, కొత్తిమీర, బెండకాయలు, వెన్న,పచ్చిమిర్చి
తయారుచేసే విధానం: ముందుగా కొబ్బరి నీళ్ళల్లో చింతపండును నానబెట్టాలి. తరువాత వెడల్పాటి గిన్నెలో నూనె వేయాలి. అది వేగాక తయారుచేసుకుని వుంచిన ఉల్లిపాయల ముద్ద, అల్లవెల్లుల్లి ముద్దను వేయాలి. తరువాత పచ్చిమిర్చి, వేసి చింతపండు రసాన్ని పోయాలి. తరువాత కారం, ఉప్పు,పసుపు, బెడకాయలను, వేసి కలిపి మరగనివ్వాలి. మరుగుతున్న ఈ మిశ్రమం లో...శుభ్రం చేసిన పులస ఫిష్ ముక్కలను వేయాలి. చివరగా కొత్తిమీర, బట్టర్, పికిల్ ఆయిల్ ను వేయాలి. అంతే ఘుమఘుమలాడే పులస ఫిష్ కర్రీ రెడీ..
|