మేష రాశి : ఈవారంలో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు, కొంత పని ఒత్తడి ఉన్న స్పష్టమైన ఆలోచనల్తో ముందుకు వెళ్లడం వలన పనులు పూర్తిచేయుయగలుగుతారు. కుటుంబంలో మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేయుటకు అవకాశం ఉంది . ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువులతో సమయం గడుపుతారు. పూజాది కార్యక్రమాలకు సమయం ఇస్తారు. గతంలో చేపట్టిన పనుల వలన మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. కొన్ని కొన్ని విషయాల్లో సర్దుబాటు మేలుచేస్తుంది.
వృషభ రాశి : ఈవారంలో మిత్రులతో ఆలోచనలు చేస్తారు, వారిని కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ ఆలోచనలకు పెద్దలనుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. సంతానపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి తప్పక పోవచ్చును. పూజాదికార్యక్రమాలకు సమయం ఇవ్వడం మంచిది. కుటుంబంలో మీ ఆలోచనలను అంతర్గతంగా ఉంచుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం.
మిథున రాశి :ఈవారంలో మీ మాటతీరు అలాగే ఆలోచన విధానం గురుంచి పట్టించుకోవడం వలన మేలుజరుగుతుంది. మొండి పట్టుదలతో అనుకున్న పనులను సాధించుకుంటారు. సంతానం గురుంచి ఆందోళన ఉన్న, దారులు అందుబాటులో ఉండుట చేత ఊరట చెందుతారు. పెద్దలతో కలిసి పనిచేసే సమయంలో ఓపిక అవసరం. మిత్రులతో కలిసి వారం చివరలో సమయాన్ని సరదాగా గడుపుతారు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చర్చల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన.
కర్కాటక రాశి : ఈవారంలో సమయం పెద్దలతో గడుపుతారు, వ్రాయి సూచనల మేర ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆత్మీయులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉండీబీ. ముఖ్యమైన విషయాల్లో కాస్త కఠినమైన నిర్ణయాల వలన మేలుజరుగుతుంది. చర్చాపరమైన విషయాల్లో మీదైనా ఆలోచనలను తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి.
సింహ రాశి : ఈవారంలో ముఖ్యమైన చర్చల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం తప్పక మేలుచేస్తుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మీయొక్క ఆలోచనలను మిత్రులతో పంచుకొని వాటిని ముందుకు తీసుకువెళ్ళు ప్రయత్నం చేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పాటించుట మంచిది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ఆశించిన సహకారం లభ్సితుంది. రుణపరమైన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట మంచిది.
కన్యా రాశి :ఈవారంలో బంధువులను కలుస్తారు. వారితో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాల గురుంచి ఒక ఆలోచనకు వస్తారు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. స్వల్పదూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతానం గురుంచి అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండుట సూచన. రావలసిన ధనం సమయానికి చేతికి అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. చర్చల్లో కాస్త నిదానం అవసరం.
తులా రాశి : ఈవారం మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. పెద్దలను కలుసుకునే ఆస్కారం ఉంది. చర్చల్లో మీకంటూ ఒక విధానం కలిగిఉన్న పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో ఒకింత ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీ మాటతీరు నూతన వివాదాలకు దారితీస్తుంది. సోదరులతో కొంత మిస్ కమ్యూనికేషన్ ఏర్పడే ఆస్కారం ఉంది, జాగ్రత్త. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అతి ఆత్మవిశ్వాసం వలన ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది.
వృశ్చిక రాశి : ఈవారంలో ఆరంభంలో కొంత నిదానం, సర్దుబాటు విధానం అవసరం. ముఖ్యమైన నిర్ణయాల్లో తడబాటు పొందుతారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. తలపెట్టిన పనుల్లో స్పష్టత అవసరం. పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ధనం వెచ్చిస్తారు. గతంలో మీరు తీసుకున్న రుణం వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆలోచనల్లో స్పష్టత అవసరం. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. సంతాన పరమైన విషయాల్లో ఒకింత ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. మిత్రులతో సమయం గడుపుతారు.
ధనస్సు రాశి : ఈవారంలో బంధువుల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాల తీసుకోకపోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో పెద్దలతో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు సర్దుకొనే అవకాశం ఉంది. పూజాదికార్యక్రమాలకు సమయం ఇవ్వడం మంచిది. ముందుగా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. చర్చల్లో మీ ఆలోచనలను పంచుకోండి.
మకర రాశి : ఈవారంలో ఉద్యోగంలో ఆశించిన మేర మార్పులకు ఆస్కారం ఉంది. మీ ఆలోచనల వలన పెద్దలనుండి గుర్తింపును పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడేలా నిర్ణయాలు తీసుకొనే ప్రయత్నం మంచిది. బంధువులతో సమయం గడుపుతారు.
కుంభ రాశి : ఈవారంలో ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన వాహనాల కోసం ధనం ఖర్చు పెడతారు. పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. చర్చల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట మంచిది.
మీన రాశి : ఈవారంలో సంతానం గురుంచి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో బాగానే ఉంటుంది, నూతన అవకాశాలు పొందుతారు. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మీ బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడంలో విఫలం చెందుతారు. మాన్సికేనా కొంత ఒత్తిడి తప్పక పోవచ్చును. మిత్రులను కలుస్తారు, వారి సూచనలను పాటించుట మంచిది. ప్రయాణాలు చేస్తారు.
|