యూట్యూబ్ పాపులర్ ఛానల్ అయిన ఖేల్‍పీడియా ద్వారా ‘వ్యాక్డ్ అవుట్ ఒరిజినల్’ గా ఇటీవల విడుదలైన లఘుచిత్రం- ప్రణతి. టాలీవుడ్‍లోని ప్రముఖ సంగీత దర్శకుడైన రఘు కుంచె గారు నటించిన ఈ చిత్ర సమీక్ష, మీ కోసం-
ప్లస్ పాయింట్స్-
సింపుల్ గా స్టార్ట్ అయిన ఈ కథ ముందుకు సాగే కొద్ది మంచి డ్రామా పం(చు)డుతూ ఉంటుంది. ఈ కథలోని కాన్ఫ్లిక్ట్ గట్టిగా ఉండడం చాలా ప్లస్ అయింది. చివరన ఇచ్చిన సందేశం చాలా మంది జీవితాలని మార్చగలదు, ముఖ్యంగా ఈ జనరేషన్ ని! పవన్ కల్యాణ్ గారి ఇన్‍డైరెక్ట్ రిఫెరెన్స్ వర్క్ అవుట్ అయ్యే చాన్స్ ఉంది. నటన పరంగా అందరూ చాలా నేచురల్‍గా చేశారనే చెప్పుకోవాలి, ముఖ్యంగా రఘు కుంచె గారు నటనలో నూరుకి నూరు మార్కులు కొట్టేశారు. డైలాగ్స్ చాలా మీనింగ్‍ఫుల్‍గా ఉన్నాయి. అన్నిటికంటే మించి, పర్సెప్షన్స్ మీద బేస్ అయి తీసిన సీక్వెన్స్ తెలుగు షార్ట్ ఫిల్మ్స్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్-
ఫ్లాష్‍బ్యాక్ సీన్స్ మరింత ఎమోషనల్‍గా తీసుండొచ్చు.
సాంకేతికంగా-
కెమెరావర్క్ నీట్‍గా ఉంటుంది. ముఖ్యంగా టెర్రస్ మీద తీసిన కొన్ని షాట్స్ చాలా బాగా కుదిరాయి, అందులోనూ సాయంత్రం వేళ తీసిన కొన్ని షాట్స్ అయితే మనకి లెజెండరీ సినిమాటొగ్రఫర్ పీ.సీ. శ్రీరాం గారిని గుర్తుచేస్తాయి. మ్యూజిక్, సినిమాతో సమానంగా సాగడం వలన సీన్స్ కి మంచి ఎమోషనల్ డెప్త్ క్రియేట్ చేస్తుంది. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్. ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ మనకి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా తీసినందుకు మొత్తం టీంని అభినందించాల్సిందే.
మొత్తంగా-
మాటల విలువ తెలియజేసిన మంచి చిత్రం!
అంఖెలలో-
4.5 / 5
LINK-
https://www.youtube.com/watch?v=yAXFH9tVXtg
|