ఒకానొకప్పుడు మార్కెట్ లో ఏవైనా వస్తువులో సరుకులో అమ్మడానికి , తామే స్వంతంగా పెట్టుబడి పెట్టడమూ, ఆ సరుకు తయారుచేయడానికి ఓ ఫాక్టరీయో ఏదో నిర్మించేవారు… అక్కడే ఇంకొంతమంది కార్మికులని నియమించి, వారిచేత ఆ సరుకులు తయారుచేయించేవారు.. ఈ తతంగం అంతా చూసుకోడానికి, ఓ Production Wing, Marketing Wing లాటివి ఓ Corporate Office లో ఉండేవి. వీటికి దేశమంతా Branch లు కూడా ఉండేవి… మొత్తంఅంతా ఒకే యాజమాన్యం కింద ఉండేవి.
కాలక్రమేణా, సరుకులు తయారుచేయడం బాధ్యత కూడా తీసుకుంటే, కిట్టుబాటవడం లేదని గుర్తించి, అసలు సరుకంతా వేరేవారిద్వారా తయారుచేయించి, వాటికి తమ పేరున్న కంపెనీల Brand పేరిట, మార్కెట్ లోకి తెచ్చి అమ్మడం మొదలెట్టారు. దినికే outsourcing అని ఓ పేరుపెట్టారు… దీనివలన ఉపయోగాలుకూడా ఉన్నాయి. సరుక్కికావాల్సిన Raw material దొరికే చోటే, చిన్నచిన్న పరిశ్రమలు మొదలెట్టించి, వారిద్వారా సరుకు తయారుచేయించడం వలన ఇద్దరికీ లాభాలు వస్తున్నాయి. ఒకటి—పెద్దకంపెనీ కి చవకలో సరుకుతయారవడం, రెండు చిన్న పరిశ్రమలకి వారు తయారుచేసిన సరుకు అమ్ముడవడం… మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఇదే పధ్ధతిలోకి వచ్చేసినట్టే.. అమెరికాలోని ప్రముఖ Brand లు కూడా, ఏ చైనాలోనో తమ సరుకులు తయారుచేయించి, తమ Brand పేరన అమ్ముతున్నారు..
మన దేశంలోకూడా ఏవో కొన్ని కంపెనీలు తప్పించి చాలామంది ఇదే పధ్ధతిలోకి దిగిపోయారు. ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఔట్ సోర్శింగే.. ఒకానొకప్పుడు కేంద్రప్రభుత్వ సంస్థల్లో , ఏక్ దం కింది స్థాయి ఉద్యోగులను సంస్థలో భాగంగా recruit చేసుకునేవారు.. ఉదాహరణకి సఫాయీ కర్మచారులూ, రవణా వాహనాల Drivers లాటివారిని… అలాటిది కొన్ని సంవత్సరాలుగా, బయటి ఏజన్సీలకే ఈ పనులు అప్పచెప్పి, , Contract పధ్ధతిన , కట్టాల్సిన డబ్బేదో కట్టేస్తే పనైపోతోంది… పడే తిప్పలేవో ఆ ఏజన్సీవాడే పడతాడు.
ఈ outsourcing అన్నది ఏదో వస్తువుల ఉత్పత్తి, అమ్మకాలవరకూ అయితే సరిపెట్టుకోవచ్చు. కానీ మనుషుల జీవితాల్లోకికూడా వచ్చేసింది… ఎలాగంటారా— జీవితంలో “ అమ్మ” అని పిలిపించుకోవాలని ఏ స్త్రీ అయినా కలలుకంటుంది. కానీ పెళ్ళిఅయిన ప్రతీవారూ తల్లి అవలేరుగా.. ఏవో అనారోగ్య కారణాలుండొచ్చు… బిడ్డల్ని కనలేకపోవడమన్నది భార్యాభర్తలిద్దరికీ మనస్థాపమే కదా..పిల్లలు పుట్టకపోవడంతో ఇదివరకటి రోజుల్లో, ఏ దగ్గరవారి పిల్లలనో దత్తత చేసుకునేవారు. అమ్మానాన్నా అని పిలిపించుకోవాలని ఏ భార్యాభర్తలకైనా ఉంటుంది…
కానీ వైద్యవిజ్ఞానం అభివృధ్ధి ధర్మమా అని, ఈ పిల్లలపుట్టుకకూడా outsourcing లోకి వచ్చేసింది ఈరోజుల్లో.. Surrogate motherhood అని కొన్ని సంవత్సరాల ముందు popular అయింది… పురుష కణాలను ఇంకొక స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టి, గర్భధారణ చేయించడం… మరి దీన్నికూడా out sourcing అనే అంటారుగా..
ఇలా చెప్పుకుంటూ పోతే ఇళ్ళల్లో ఇల్లాళ్ళు కూడా కొన్నికొన్ని పనులు, భర్తలకి outsourcing చేసేస్తున్నారు… పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవడం కష్టమే.. ఆర్ధికస్థోమతనిబట్టి పనిమనుషులని పెట్టుకుంటారనుకోండి.. కానీ ఈరోజుల్లో పనిమనుషులు దొరకడంకూడా అంత సులభం కాదు.. మరి అలాటప్పుడు ఒకరికొకరు పనిలో సహాయం చేసుకుంటే కానీ కుదరదుగా మరి.
ఈరోజుల్లో ఇంటిపనులలో చాలా ఆధునిక పధ్ధతులు వచ్చేసాయి.. బట్టలుతకడానికి washing machine, అంట్లు శుభ్రపరచడానికి dish washer, ఇల్లుతుడుచుకోదానికి vacuum cleaner, పిండిరుబ్బుకోడానికి food processor లాటివి ఉండనే ఉన్నాయి.. ఆ ఆరిన బట్టలు మడతపెట్టడం పని భర్తగారికి outsource చేసేయడం. ఇదివరకటిలా, మార్కెట్ కి వెళ్ళి కూరగాయలూ, సరుకులూ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు.. వాటిని online లో order చేసేస్తే, గుమ్మంలోకి వచ్చేస్తాయి. అలాగే ప్రతీవారూ కార్లుకూడా maintain చేయవలసిన అవసరం లేకుండా, ఫోనులో book చేసేసుకుంటే, క్షణాల్లో గుమ్మం ముందరకి cab వచ్చేస్తోంది.
ముందుముందు ఇంకా ఏమేటేమిటి ఈ outsourcing జాబితాలోకి వచ్చేస్తాయో చూడాలి.. పోనిద్దురూ డబ్బు ఖర్చైతే అయిందికానీ శ్రమ తప్పిందిగా అని సంతోషపడ్డం…
సర్వేజనా సుఖినోభవంతూ…
|