మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతున్న ఈ భారీ షూటింగ్ షెడ్యూల్‌లో దాదాపు చిత్ర యూనిట్‌లో ముఖ్య తారాగణం అంతా పాల్గొంటోంది. వారితో పాటు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కూడా పాల్గొనడం విశేషం. 'రంగస్థలం' సినిమా షూటింగ్ కోసం చరణ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో స్టే చేసినప్పుడు ఉపాసన కూడా ఆయనతో పాటు అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసింది. షూటింగ్ స్పాట్‌లో ని చరణ్ లుక్‌కి సంబంధించిన కొన్ని ఫోటోల్ని, షూటింగ్ సమాచారాన్ని చూచాయగా అభిమానులతో పంచుకునేది.
అలాగే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ సమాచారం కోసం ఉపాసన ట్విట్టర్‌లో ఫాలోవర్స్ మరింత క్యూ కడుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించిన ఫ్రెష్ అప్‌డేట్స్‌ని తెలుసుకునేందుకు కుతూహలం చూపిస్తున్నారు. అందుకే అభిమానుల కోసమే అన్నట్లుగా చరణ్ లుక్‌ని రివీల్ చేసింది ఉపాసన. కండలు తిరిగిన శరీరంతో స్విమ్మింగ్ పూల్‌లో వెనక్కి తిరిగి ఉన్న చరణ్ లుక్‌ని చూసే అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక స్ట్రెయిట్ ఫోటోల్లో చరణ్‌ని చూస్తే ఇంకెంత పండగ చేసుకుంటారో కదా. అందుకోసమే ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే అజర్‌బైజాన్‌లో దాదాపు 25 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణలో చరణ్ చాలా చాలా కష్టపడుతున్నాడట. సీన్స్ చాలా బాగా వస్తున్నాయని ఉపాసన చెబుతోంది. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 'భరత్' బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
|