Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sundaravadana poems

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాకూలు - సాయిరాం ఆకుండి

ఇం'ధన' నష్టం

భూమిలో నిండుకుంటున్న ఇంధనం...
భావితరాలకు ఇక ఏం సాధనం?

ప్రత్యామ్నాయాలు లేవా కనుచూపు మేరలో...
ప్రయత్నిస్తే ఎన్నో వనరులు ఈ భువిలో!!


ఔను... వాళ్ళిద్దరూ కలిసిపోయారు

ఓటు సమీకరణాలలో...
నిన్నటి ప్రత్యర్ధులు నేడు కలిసిపోతారు!

నేటి రాజకీయాలలో...
ఎప్పటికీ ప్రజలే నష్టపోతారు!!


ఆ'కలి' కాలం

టన్నులకొద్దీ వ్యర్ధమవుతున్న ఆహారం...
లక్షలమందిది ఆకలి చావుల పోరాటం!

పొదుపును పాటించి ఆకలి కడుపులు నింపితే...
మంచితనం నిలిచి మానవత్వం గెలవదా!!

మరిన్ని శీర్షికలు
Navvula Jallu by Jayadev Babu