Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
actress suryakantham

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (అక్టోబర్ 25 - అక్టోబర్ 31) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్ర,శని వారాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు వారితో కలిసి నూతన పనులను ఆరంభిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. ఆది,సోమవారాల్లో బంధుమిత్రులతో కలిసి చేయుపనులలో నిదానం అవసరం మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం. నూతన పనుల విషయంలో తొందరపాటు పనికిరాదు. మంగళ,బుధవారాల్లో స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది. ఒకవార్త ఇబ్బందిని పెట్టు అవకాశం కలదు కలదు,మానసికంగా దృడంగా ఉండుట మేలు. గురువారం మీరు పెద్దల సహకారంను తీసుకొని మీ పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వారం మొత్తంమీద పనులలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకు కొనసాగించే ప్రయత్నం చేయండి మంచిది. సమయానికి భోజనం చేయండి. అధికారులతో నిదానంగా వ్యవహరించుట ఉత్తమం పనులలో నిదానంగా వ్యవాహరించుట వలన మేలుజరుగుతుంది. పెద్దలను కలవడానికి చేయు ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. వారి ఆలోచనలను పాటించే ప్రయత్నం చేయుట ద్వార పనులు ముందుకు సాగుతాయి.          

వృషభ రాశి
ఈరోజు మీరు శుక్ర,శనివారాల్లో అనుకోని సంగటనలు జరుగుట మూలాన కొంత మనోవిచారంను పొందుటకు అవకాశం ఉంది. భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండుట మంచిది. ఆది,సోమవారాల్లో పనులలో ఉత్సాహంను కలిగి ఉండి పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఇష్టమైన పనులను పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. మంగళ,బుధవారాల్లో బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోవడం మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు జాగ్రత్త. పనులలో కొంత జాప్యం ఉంటుంది పెద్దల సూచనలు పాటించుట మంచిది. గురువారం ప్రతిపనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. వారం మొత్తంమీద పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన పనులను చేపడుతారు కాకపోతే పనులలో శ్రమను కలిగి ఉంటారు కావున పనుల్లో నిదానం అవసరం. వినొదముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు వాటికి సమయాన్ని ఇచ్చుటకు అవకాశం ఉంది. 

మిథున రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. పనులలో ఉత్సాహంను చూపిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఆది,సోమవారాల్లో మాటను పొదుపుగా వాడుట సూచన. అనారోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు తగిన విధంగా జాగ్రత్తలు చేపట్టుట మంచిది. మంగళ,బుధవారాల్లో పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు కాకపోతే అనుకోని ఖర్చులు కలుగుతాయి. విందులు,వినొదములలొ పాల్గొనే అవకాశం కలదు. గురువారం ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు కావున నూతన ప్రయత్నాలు చేయకండి. వారం మొత్తంమీద ధనవ్యయాన్ని పొందుటకు అవకాశం కలదు కావున ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. నిర్ణయాలు తీసుకోవడంలో నిదానంగా వ్యవహరించుట మంచిది. ఇష్టమైన వ్యక్తులను కలువడానికి ఇష్టపడుతారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. అకారణంగా ఏర్పడు కలహాముల పట్ల మాత్రం జాగురుకతతో ఉండుట సూచన. కుటుంభంలో శ్రమను కలిగి ఉంటారు సర్దుబాటు విధానం ఆవలంభించుట మంచిది. 

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో పనులలో శ్రమను పొందుతారు,నూతన పనులను వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు కలుగుతాయి. ఆది,సోమవారాల్లో ఉత్సాహంను కలిగి ఉండి మిత్రుల సహకారంను తీసుకొని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు మృష్టాన్న భోజనప్రాప్తిని కలిగి ఉంటారు. మంగళ,బుధవారాల్లో ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ప్రతిపనిలో నిదానం అవసరం ఒకటికి రెండు సార్లు ఆలోచించి మొదలు పెట్టుట మంచిది. గురువారం ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. వారం మొత్తంమీద ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. స్నేహితులతో కలిసి పనులను చేపట్టునపుడు జాగ్రత్త అవసరం. మాత్రుసౌఖ్యంను కలిగి ఉంటారు అదేవిధంగా మాత్రువర్గం వారి నుండి సహకారంను పొందుటకు అవకాశం ఉంది. బంధువులతో సమయాన్ని గడుపుతారు,భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. 
  

సింహ రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో బంధువుల గృహంలో సమయాన్ని గడిపే అవకాశం కలదు. తలపెట్టిన పనులలో అనుకూలమైన ఫలితాలు కలుగడం చేత సంతోశంను పొందుటకు అవకాశం ఉంది. అది,సోమవారాల్లో ఆలోచనల మూలాన కొంత ఇబ్బందులను పొందుతారు కావున వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించట సూచన. మంగళ,బుధవారాల్లో పనులలో కొంత వేగం పెరుగుటకు అవకాశం కలదు. నూతన పనులను చేపట్టాలనే ఆలోచనను కలిగి ఉంటారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. గురువారం పెద్దలను కలిసే అవకాశం కలదు కావున వారికి అనుగుణంగా నడుచుకొనే ప్రయత్నం చేయండి. వారం మొత్తంమీద సంతానమూలక సౌఖ్యంను కలిగి ఉంటారు. బంధువులను కలిసి వారికి సమయాన్ని కేటాయించే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. వాహనముల మూలన ఇబ్బందులు తప్పక పోవచ్చును కావున జాగ్రత్త. అధికారులతో పనిభారంను పొందుతారు. మీరు చేపట్టిన పనుల మూలాన కుటుంభంలో గౌరవం పెరుగుతుంది. 

 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో ప్రయత్నాలలో విజయంను పొందుతారు. ఇష్టమైన పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. ఆది,సోమవారాల్లో బంధువులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. అధికారులకు అనుగుణమైన పనులను చేపట్టి వాటిని పూర్తిచేసి అధికారులచే గుర్తింపును పొందుతారు. మంగళ,బుధవారాల్లో చేపట్టిన ఆలోచనల మూలాన కొంత ఖర్చు పెరుగుతుంది తద్వరా ఆలోచనలు అధికమయ్యే అవకాశం కలదు ఒకసారి ఈవిషయం పైన శ్రద్ద పెట్టుట ఉత్తమం. వారం మొత్తంమీద వ్యాపారంలో,వ్యవసాయంలో సాధ్యమైనంత వరకు నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. చేయువృత్తిలో కొంత మేర శ్రద్ధను పెంచుప్రయత్నం చేయండి. ఆరోగ్యం  విషయంలో మాత్రం శ్రద్ద చూపుట వలన మేలుజరుగుతుంది. గతంలో మీకున్న పెద్దల పరిచయాలు కొంత ఉపయోగ పడుటకు అవకాశం కలదు లాభంను పొందుతారు. వ్యాపారంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త పడుట మంచిది నూతన నిర్ణయాలు వద్దు. 

తులా రాశి
ఈవారం మీరు వారం శుక్ర,శనివారాల్లో కుటుంభంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఆది,సోమవారాల్లో పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. అధికారులతో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు కలుగుతాయి. మంగళ,బుధవారాల్లో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. గురువారం మాత్రం అధికమైన ఆలోచనలను కలిగి ఉండే అవకాశం ఉంది వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మొత్తంమీద సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో నిదానంగా వ్యవహరించట వలన మేలుజరుగుతుంది. అనారోగ్యసమస్యలు తప్పకపోవచ్చును. తలపెట్టిన పనులలో ఆశించిన ఫలితాలు కలుగుతాయి కాకపోతే సమయపాలన అవసరం. కుటుంభంలో సంతోషం చెందు మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం పెద్దల సూచనలు పాటించుట ఉత్తమం.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. చేపట్టిన పనులలో కష్టములు పొందుటకు అవకాశం ఉంది. అది,సోమవారాల్లో కుటుంభంలో మీరు తీసుకొనే నిర్ణయాల్లో ఆలోచన అవసరం లేకపోతే ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది సూచన. మంగళ,బుధవారాల్లో ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన పనులు పూర్తిఅవుతాయి. ధనమునకు సంభందించిన విషయాల్లో కొంత వరకు కోలుకొనే అవకాశం ఉంది. గురువారం బంధువుల నుండి వార్తను వినే అవకాశం ఉంది కొంత సంతోషంగా గడిపే అవకాశం ఉంది. వారం మొత్తంమీద అనవసరపు ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీఆప్తుల ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ధనవ్యయం అయ్యే అవకాశం కలదు ఈవిషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యంను మాత్రం అశ్రద్ద చేయకండి. మాటలను మాత్రం చాలావరకు జాగ్రత్తగా వాడుట మేలుచేస్తుంది. సౌఖ్యంను కోరుకొనే అవకాశం ఉంది. 


ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో ఆర్థికంగా బాగుంటుంది కాకపోతే నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనుల మూలాన నలుగురిలో గౌరవాన్ని పొందుతారు. నూతన పనులను చేపడుతారు. ఆది,సోమవారాల్లో పనులలో ఒత్తిడి మూలాన స్వల్ప ఆనారోగ్యసమస్యలు తప్పక పోవచును. అనుకోని సంగటనలు ఎదురయ్యే అవకాశం కలదు. మంగళ,బుధవారాల్లో కుటుంభంలో నిర్ణయాలు తీసుకొనే ముందు అందరిని సంప్రదించుట అనేది మంచిది. ఉద్యోగంలో అధికారుల మూలాన ఒత్తిడిని కలిగి ఉంటారు కావున జాగ్రత్తగా వ్యవహరించుట అనేది మంచిది. గురువారం కొంత కోలుకొనే అవకాశం ఉంది చేపట్టిన పనులు ముందుకు కదులుతాయి. పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. వారం మొత్తంమీద అధికారులకు అనుగుణంగా నడుచుకొనే అవకాశం ఉంది. నచ్చిన పనులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తిచేసి పేరును సంపాదించుకునే అవకాశం ఉంది. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. స్థానచలనం కలుగుటకు అవకాశం కలదు. బంధువులను కలుస్తారు వారితో కలిసి నూతన ఆలోచనలు చేస్తారు. విలువైన వస్తువులను మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి.

మకర రాశి

ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో కుటుంభంలో సౌఖ్యంను పొందుతారు అనుకున్న పనులను సమయానికి పూర్తిచేసే అవకాహ్సం కలదు. ఇతరులకు సేవచేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఆది,సోమవారాల్లో నలుగురిలో చేపట్టిన పనుల మూలాన గౌరవాన్ని పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. స్త్రీ/పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. మంగళ,బుధవారాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి నిదానంగా వ్యవహరించుట మంచిది. గురువారం అనవసరపు కలహములు కలుగుటకు అవకాశం ఉంది కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట మేలుచేస్తుంది. వారం మొత్తంమీద అధికారులతో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని వెళ్ళుట మూలాన తప్పక పనులలో మంచి జరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. గతంలో తీసుకున్న ఋణముల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. భోజనం విషయంలో ఆసక్తిని చూపిస్తారు సౌఖ్యంను కలిగి ఉంటారు.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు పెద్దల సూచనలు పాటించే ప్రయత్నం చేయండి ఉత్తమం. ఒకవార్త కొంత భాధకు గురిచేస్తుంది. మానసికంగా దృడంగా ఉండుట అనేది సూచన. ఆది,సోమవారాల్లో పనులను విజయ వంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంభంలో వచ్చు మార్పులు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. కుటుంభసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది.మంగళ,బుధవారాల్లో మీ ఆలోచనలు గుర్తింపును సంపాదించి పెడుతాయి. ఉద్యోగంలో అధికారులలో గుర్తింపును కలిగి ఉంటారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చును మాత్రం నియత్రించుట మంచిది. గురువారం నూతన పనులలో సమయాన్ని అధికంగా గడుపుట మూలాన కొంత అనారోగ్యం ఇబ్బందిని పెట్టుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు. వారం మొత్తంమీద ఖర్చును కలిగి ఉంటారు ఆశించిన దానికన్నా అధికమైన ఖర్చు కలుగుతుంది జాగ్రత్త. కోపాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. ఒకవార్త కొంతమేర కలవరపెట్టు అవకాశం ఉంది. సమయానికి భుజించుట ఉత్తమం. పనులలొ ఉత్సాహంను కోల్పోయే అవకాశం ఉంది నిరుత్సాహం చెందకుండా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయండి. 

మీన రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో పనులలో ఆటంకాలు కలుగుత మూలాన ఆందోళన చెందుటకు అవకాశం ఉంది కావున నూతన పనులను ఆరంభించక పోవడం మేలు. బంధువుల మూలాన చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. ఆది,సోమవారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఖర్చు పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయత్నాలలో ఇబ్బందులు తగ్గకపోచ్చును. కుటుంభంలో నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. మంగళ,బుధవారాల్లో కొంత మేర మిత్రులు,అధికారుల మూలాన సహాయం పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుటుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంభంలో పూర్తిసహాకారం పొందుతారు. గురువారం మీరు చేసిన ఆలోచనకు గౌరవం ఉంటుంది. నూతన పనులను చేపడుతారు. పెద్దలకు దగ్గరయ్యే అవకాశం కలదు. వారం మొత్తంమీదఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట ఎంతైనా మంచిది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. వ్యతిరేక వర్గం నుండి వచ్చు సమస్యలు కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది. పనులలో కొంత ఆటంకాలు కలిగే అవకాశం లేకపోలేదు జాగ్రత్త. ఇతరులకు సహాయం చేయుట వలన కొంత సంతృప్తిని కలిగి ఉంటారు. సమయానికి భోజనం చేయట శ్రమను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. గురువుల యెడల ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు దానిమూలాన కొంత మేలు జరుగుతుంది. 

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
cine pichi