Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Jnanpith to Swargpith

ఈ సంచికలో >> శీర్షికలు >>

సుందర వదనాష్ట కందాలు - వి.యస్.కె.హెచ్.బాబురావు

sundaravadana poems

కం.  అమ్మను పుట్టిన మన నే
      లమ్మను స్వర్గముగ దలచు లిఖితంబది నా
      కమ్మని మాటలు మరువక
      సన్మతి తో డను మెలగుము సుందరవదనా!              1
 

కం.  పరులేమి యొనర్చిన నీ
      పరువే గంగ కలిసెనని పొగలక యావం
      కర పనులొరులకు సేయక  
      సరుగు జనులు మోదమునొంద సుందరవదనా !            2

కం. ధూమ సురా పానములును
     సే మము గాదని తెలియుము దే హము పాడౌ
     నీమము దప్పక వేంకట
     సామిని గొలువగ శుభమగు సుందర వదనా !                3

కం. మాతా పితలను గురులను
     హితముగ పూజించి కొల్చు విధిగా నెప్డున్
     సత్యము కరుణయు నలవడి
     సాత్విక ధర్మము నెరపుము సుందర వదనా!                 4

కం. కోపము తాపఘనపటా
     టోపము బీరంపుమాట టెక్కులు నిక్కుల్
     చూపక శాంత వినయ గుణ     
     సంపదలు గలిగి బరగుము సుందర వదనా!                    5

కం. మూరెడు బోకుము సరగున
     బారెడు కుంగకు చెరపకు బరులను చెడుగౌ
     నేరము లెన్నకు నితరుల
     సరిపడి కూరిమి నెరపుము సుందర వదనా!                   6

కం. బిడ్దలగనంగనె జనదు
     చెడ్డయు మంచియు తెలిపియు జెలగుట నెరగన్
     దొడ్డగ మెలగుట నేర్పియు
     సొడ్దులు లేకుండ పెంచు సుందరవదనా!                           7

కం. పుట్టిన గిట్టుట తధ్యము
     జట్టుగ రారెవరున్ నిజంబిది తెలియన్
     గట్టి పనొకటయినను సలుపు
     సాటి  జనుల మేలు దలచి సుందర వదనా !                      8           

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi