రావూరి భరద్వాజ అనే వ్యక్తి గురించి ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం దక్కే వరకూ ఎక్కువ మందికి తెలియదు. ప్రతిష్టాత్మకమైన జ్ఞాన్ పీఠ్ పురస్కారం దక్కిన తరువాతనే రావూరి భరద్వాజ గురించి సామాన్యులు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించారు. నిరాడంబర జీవితమే తనను గొప్ప రచయితని చేసిందంటారు రావూరి భరద్వాజ. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న రావూరి, స్వర్గపీఠం అధిరోహించారిప్పుడు.
పాకుడు రాళ్ళు అనే రచనను రావూరి ఎప్పుడో చేశారు. అది కొందరికి బాగా నచ్చిన రచన. ఆ రచనకు ఎప్పుడో గుర్తింపు భించాల్సి ఉన్నప్పటికీ, ప్రతిభకు ఆలస్యంగానైనా గుర్తింపు లభించింది. తెలుగు సాహితీ రంగానికి రావూరి చేసిన సేవలను ప్రముఖులు కొనియాడుతూనే ఉన్నారు. రావూరి లేకపోయినా ఆయన రచనలు, పుస్తకాభిమానుల్ని రంజింపజేస్తునే ఉంటాయి. అలా ఆయన ఎప్పుడూ సాహిత్యాభిమానుల గుండెల్లో కొలువై ఉంటారు.
1927లో రావూరి జన్మించాను. 18 అక్టోబర్ 2013లో ఆయన స్వర్గపీఠాన్ని అధిరోహించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అంటే, విద్యాధికుడని అనుకోవచ్చు ఎవరైనా. కానీ ఆయన చదువుకున్నది ఏడో తరగతి మాత్రమే. చదువులేదు, నువ్వు రచనలు చేస్తావా? అని గేలి చేసేవారట రావూరిని. అలా గేలి చేసినవారే ఆయన రచనా ప్రస్తానం ప్రారంభించాక ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.
సినిమా పరిశ్రమతో వున్న అనుబంధం, సినిమా వ్యక్తులతో వున్న పరిచయాలు, ఇవన్నీ పాకుడు రాళ్ళు పుస్తకం రాయడానికి ప్రేరేపించాయని అంటారు రావూరి భరద్వాజ. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, చనిపోవడానికి కొన్ని నెలల ముందు మాత్రమే ఆయనకు జ్ఞానపీఠ అవార్డు దక్కడం. అప్పటివరకూ ఆయన్ను ఎవరూ గొప్ప రచయితగా గుర్తించకపోవడం. తన ప్రతిభ గురించి, తన తదనంతరం తరాలవారు చెప్పుకోవడం ఏ వ్యక్తికైనా గొప్పతనం. అది రావూరి భరద్వాజ విషయంలో నూటికి నూరుపాళ్ళు సత్యం.
|