Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mrutyukeli

ఈ సంచికలో >> శీర్షికలు >>

కవితలు - ..

శ్రీకారం
అంతర్జాతాల అధిపతిగా
అనుసరించు వారికి ఆహ్లాదంగా
ప్రతి శుక్రవారం
కథలు, సీరియల్ ల తోరణాలతో
మాధవుని పర్యవేక్షణలో
యువతరపు పరుగులతో
జయదేవుని నవ్వుల గీతలతో
సరసి చక్కని చిక్కని పంచ్ లతో
ప్రతాపభావాల అనుభవాల
సమ్మిళిత సరికొత్త శీర్షికలతో
కార్టూన్ల కేళీవిలాసాలు
చమక్కులు, సినిమా ట్రిక్కులు
ఎన్నో మరెన్నో శీర్షికలతో
షడ్రసోపేత భోజనంలా
'బన్ను' గారి చేతినుంచి వెలువడిన
మహత్తర వారసంచికకు
మృష్టాన్నము తదుపరి అందించు
'చిలక' లా వస్తున్నది సరికొత్త
కవితా శీర్షిక పసందుగా
అందుకుందాం అందరం
అవకాశాన్ని ఆనందంగా
ఎక్కించుదాం అందలం
మన 'గో..తెలుగు' ఘనంగా
మరెంతో కొత్తదనం రావాలని
కోరుకుందాం సగర్వంగా......

 

- శింగరాజు శ్రీనివాసరావు

****************

వశీకరిణి


నీ మోము
సమ్మోహనం
నీ చూపు
మాయాజాలం
నీ నవ్వు
మధురగానం
నీ పలుకు
పరవశం
నీ మేని గంధం
నీ మందగమనం
నీ నడుముహొయలు
నీ పడుచులయలు
మొత్తంగా నువ్వు
తెలుగు భాషా సొగసునంతా
కూర్చి పాడినా
అలుపు రాని
వశీకరణ సోయగం

 

నాగ్రాజ్...
****************


☺️చిత్ర కవిత☺️

షవర్ బాతు లోని పన్నీటి కన్నా,
ప్రకృతి వడి లోని చినుకుల జడి మిన్న.
చలిమర గదులలో తాగే చాయి కన్నా.
చెరువు గట్టున కురిసే వాన హాయి మిన్న.
వాట్సప్ లోని గంటల తరబడి చాట్ లు కన్నా.
ఆకాశపు పందిరి కింద పొందే హాయి మిన్న.
రంగు రంగుల గొడుగు నీడల కన్నా.
అరిటాకు ఆచ్ఛాదనే మాకు మిన్న.
బాల్య మెరుగదయా ఏ దుఃఖము.
దానిని మించి ఇలలో లేదయ్య ఏ సుఖము.
చెరువు గట్లమీద పట్టిన చేపలు, సుఖాలను ఊరించే వూట చలములు.
చెట్టు కొమ్మలే మాకు పట్టు పరుపులు.
కోతికొమ్మచ్చి ఆటలే మాకు ఆటవిడుపులు.
పైసా ఖర్చు చేయక పొందు మెండైన ఆనందం.
బాల్య స్నేహితులతో గడిపే క్షణాలే పరమానందం.
వయస్సు పెరిగితే సుఖాలు సున్నా.
దీనికి సాటి సుఖం ఈ ఇలలోనే లేదన్నా.|

- సిహెచ్.నిర్మల

 

 

****************


4.ప్రవహిస్తున్న దృశ్య చిత్రం...!!!

 

కొన్ని విధ్వంసాలు
చిత్రంగా  కుంచెకు అందవు...
సహజ వర్ణాలనద్దుకున్న
 ప్రళయ సన్నివేశాలే
ప్రకృతి చిత్రించిన
ఛాయాచిత్రాలౌతాయి.
రంగులన్నీ పాకిపోయి  
 మిళిత వికృత వర్ణమొక్కటి
ఉదయించి  
కాన్వాసు అవసరం లేని
నూతన  కళ
రాజ్యమేలుతుండగానే  
ఎత్తునుండి పల్లానికి
ప్రవహించే కుంచె ఒకటి
ఆ దారిని చిత్రించుకుంటూ వెళ్తుంది.
విలయానికి విగతవస్తువులన్నీ
సాక్ష్యాలుగా  మిగులుతూ
మచ్చలు తేలిన ముఖాల్ని
గుర్తుచేస్తుంటాయి.
మానవత్వాన్ని ప్రతిబింబిస్తున్న
పిడికిళ్ళుతెడ్లుగా చేసుకుని   
చిత్రాన్ని చీల్చుతూపోతున్న నావ
ఆలంబన  చుక్కానితో
ఆక్రందనల దారాలకు వేలాడుతున్న
అభాగ్య అమాయక ప్రాణాలను
హృదయపు లోగిలిలో పొదువుకున్న చందం.
తల్లి మనసు లాలనతో
చిత్రపు చిరుగును  
ఓదార్పు దారం తో   కుట్టుకుంటూ  
మరలిపోతుంటే
ఆ మకుటాయమాన వర్తమాన చిత్రం  
తాకుతున్న ప్రతి బండరాయి కన్నీరై  
 కరిగి గంగ యై మలగి
ప్రశ్చన్నసూర్యోదయం వైపు  
సాయమందిస్తూ  ...
సాగిపోతూ...సాగిపోతూ...!!!

- కొత్తపల్లి ఉదయబాబు
****************

మరిన్ని శీర్షికలు
pratapabhavalu