Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
days

ఈ సంచికలో >> శీర్షికలు >>

16 - 11 -2018 నుండి 22-11-2018 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈ వారం పెద్దలను కలుస్తారు, వారితో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. జీవితబాగాస్వామితో మరింతగా విభేదాలు పెరుగుటకు ఆస్కారం ఉంది. మీరు కాస్త మీ గురుంచే అధికంగా ఆలోచన చేయుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం ఉంది, కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుతాయి.  

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈ వారం నూతన ఉద్యోగప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైన విషయంలో నూతన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరులతో కలిసి చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని కొన్ని విషయాల్లో మీ ఆలోచనలు ఇతరులను ఇబ్బంది పెట్టిదిగా ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతాయి, మీలో ఉన్న నూతన ఆలోచనలను లేదా కోరికలకు అనుగుణంగా మీ ప్రవర్తన ఉండే ఆస్కారం ఉంది.  

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

 ఈ వారం  నూతన పరిచయాలు ఏర్పడుతాయి, వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబాటు పొందుతారు. స్వల్పదూరంలో ఉన్న బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు మాత్రం సమాధానం చెప్పవలిసి వస్తుంది. చర్చలకు దూరంగా ఉండే ప్రయత్నం మంచిది.     

 


కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈ వారం బంధువులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి, అవతలి వారై అభిప్రాయాలను తెలుసుకొనే ప్రయత్నం చేయుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఆరోగ్య పరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.   

 


సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈ వారం  కుటుంబ పరమైన విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది, కాస్త ప్రణాలిక కలిగి ఉండుట సూచన. చేపట్టిన పనుల విషయాల్లో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ, రుణపరమైన విషయాల్లో శక్తి గుర్తెరిగి ముందుకు వెళ్ళండి. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేస్తారు. బంధువులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం వలన మేలుజరుగుతుంది.  

 


కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈ వారం ఉద్యోగంలో అధికారుల నుండి పూర్తిగా సహకారం లభిస్తుంది , అధిక సమయం చర్చల్లో పాల్గొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి, దీనివలన కొంత నిరాశ చెందుటకు ఆస్కారం ఉంది. సంతానం వలన సంతోషాన్ని పొందుతారు. అనుకోకుండా ధనం చేతికి అందుతుంది. నూతన ఉత్సాహాన్ని పొందుతారు. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. పూజాదికార్యక్రమంలో పాల్గొంటారు.  

 


తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం  కోపాన్ని తగ్గుంచుకోవడం వలన మేలుజరుగుతుంది. చిన్న చిన్న సహాయాలు మిత్రుల నుండి పొందుతారు. రావాల్సిన ధనం కొంతమేర చేతికి అందుతుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. విదేశీ ప్రయత్నాలు కలిసివస్తాయి. కుటుంబంలో శుభకార్యక్రమాల గురుంచి నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి నుండి వచ్చిన సూచనలకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే, మీరు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం సూచన.   
 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈ వారం  దూరప్రదేశ ప్రయాణాలు చేయవల్సి రావొచ్చు, విదేశాల్లో ఉన్న మిత్రులు లేక బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. సమయాన్ని కాస్త మీకు నచ్చిన విధంగా గడుపుతారు. పెద్దలతో మాత్రం మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానము మంచిది. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో విభేదాలు రాకూండా చూసుకోండి. ఆత్మీయులను కలుస్తారు, వరావుతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. పనులు ముందుకు సాగుతాయి.  

ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

 ఈ వారం  ఆలోచనలు పెరుగుటకు ఆస్కారం ఉంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీస్కోవడం మేలు. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారు. సంతానం విషయంలో పెద్దలను ఆశ్రయించే అవకాశం ఉంది , కాస్త ఓపిక అవసరం. పెద్దవాళ్ళతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది, అలాగే వారినుండి పూర్తిగా సహకారం పొందుతారు. సంతానం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు.      
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈ వారం  చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి , తోటివారి సహకారంతో పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయంలో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. జీవితభాగస్వామితో మీకున్న విభేదాలు మరింతగా పెరుగుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో బాగాఉంటుంది. భాగస్వామ్య ఒప్పందాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీ ప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన.  

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈ వారం కుటుంబసభ్యులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది రావలిసిన ధనం కొంతమేర చేతికి అందుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది , చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి, నూతన పెట్టుబడుల విషయంలో కచ్చితమైన స్పష్టతతో ముందుకు వెళ్ళండి. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు.  

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈ వారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టు పనులను కాస్త స్పష్టతతో ముందుకు వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్దగా ఉన్న ఇబ్బందులు పొందుతారు, జాగ్రత్త. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు  వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. గతంలో మీరు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండుట సూచన. రావాల్సిన సహకారం తోటివారినుండి పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు.   

 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 

మరిన్ని శీర్షికలు
mother love