Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu -

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాపవెంకటసుబ్బారాయుడు

pratapabhavaalu

హమ్మయ్యా..కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. కొత్త మనకు మంచి చేస్తుందన్నఆశలు..ఆలోచనలు సహజం. కాలాన్ని విభజన చేసి మనం పేర్లు పెట్టుకున్నాం గాని అనంత కాలవాహినిలో కష్టాలు, సుఖాలు, బాధలు, భయాలు మామూలే! అవి మనకే కాదు ప్రకృతిలోని సమస్త జీవరాశికి, జఢ పదార్థాలకీ వర్తిస్తాయి. కాకపోతే అవి వ్యక్తీకరించలేవు. మన గోల చేస్తాం.

నిజానికి మనం ప్రకృతిలో భాగం అనుకున్నప్పుడు స్పందన కూడా సహజంగానే ఉంటుంది. కానీ మనం పూర్వ జన్మలో అనంత పుణ్యమేదో చేసి మనిషి జన్మ ఎత్తామనుకుంటాం. విర్రవీగుతాం. మరి మిగతా జీవరాశి సంగతి? ఉదాహరణకు ఎక్కడన్నా భూకంపమో, తుపానో వచ్చిందనుకోండి, ఆ ప్రాంతంలోని వాళ్లకి సహాయ సహకారాలందించడానికి యావత్ ప్రజానికం ఆపన్న హస్తం అందిస్తారు. మరి అక్కడి మూగ జీవాల్ని ఎవరన్నా కాపాడతారా? అలా ఎక్కడన్నా చూశామా? కొండొకచో చూసినా మొదటి ప్రాధాన్యత మనిషికే! అదండీ మన స్వార్థం. అలాంటి ప్రాంతాల్లో వాటికీ షెల్టర్లు నిర్మించాలి. మనిషిని మనిషి ఆదుకోవడం మానవత్వం కాదు, సమస్త ప్రకృతిని సమాదరించటం మనిషితనం. ముందు మనసులో ఆ బావానికి అంకురార్పణ చేసుకోవడం ముఖ్యం. అది ఈ సంవత్సరం నుంచే ఆరంభించాలి.
నేను అన్న జాఢ్యాన్ని వదించుకుని సమిష్టిగా మనం అన్న భావానికి పయనిద్దాం.

మరిన్ని శీర్షికలు
talaraata cartoons