Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

మహానుభావులు జయంతులు
ఫిబ్రవరి 8

శ్రీ ఆండ్ర శేషగిరి రావు  : వీరు ఫిబ్రవరి 8, 1902 న  కొడమంచలి  లో జన్మించారు.  సుప్రసిధ్ధ కవి, నాటక కర్త., పత్రికా సంపాదకులు.. వీరికి సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టుండేది. ఆనందవాణి, ఆంధ్తభూమి పత్రికలలో పనిచేసేవారు. ఎన్నో పుస్తకాలు రచించారు.

ఫిబ్రవరి 9

శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి : వీరు ఫిబ్రవరి 9 , 1936 న పోతుగడ్డలో జన్మించారు. స్త్రీ పాత్రధారణ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు.  స్వంతంగా సత్యసాయిబాబా నాటక సమాజము స్థాపించి నాటక ప్రదర్శనలిచ్చి రసజ్ఞులందరి మెప్పు పొందారు. శాస్త్రి పాత తరం నటుల సంప్రదాయాలైన క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అన్వేషణ, నిత్యసాధన, కొత్త ప్రయోగాలపై తపన, ఆశయసాధన కనిపిస్తాయి.   

ఫిబ్రవరి 11

శ్రీ గురజాడ రాఘవ శర్మ  :  వీరు ఫిబ్రవరి 11, 1899 న  గురజాడ లో జన్మించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త.[1][2] ఈయన తన కవితల ద్వారా, ఉత్తేజకరమైన రచనల ద్వారా భారతదేశ ప్రజలలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించినాడు. గాంధేయ మార్గాన్ని అవలంభించారు. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు .

శ్రీ తరిమెల నాగిరెడ్డి :   వీరు ఫిబ్రవరి 11 , 1917 న, తరిమెల లో జన్మించారు. ప్రముఖ కమ్యూనిస్ట్  నాయకుడు.పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచారు.

ఫిబ్రవరి  13

శ్రీ గట్టి లక్ష్మి నేఅసింహ శాస్త్రి  : వీరు ఫిబ్రవరి 13, 1913 న కొల్లూరు లో జన్మించారు.సుప్రసిధ్ధ పండితులు. 1955లో తురీయాశ్రమ దీక్ష స్వీకరించి తన పేరును నృసింహానంద భారతీ స్వాములుగా మార్చుకున్నారు. వీరు సమస్త దేవతా రూపంలోని లోకేశ్వరునిపై స్తోత్రాలురచించారు. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, 
ఐతరేయోపనిషత్తు మొదలైన గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు. 

ఫిబ్రవరి 14

శ్రీ దామోదరం సంజీవయ్య : వీరు ఫిబ్రవరి 14, 1921  న  కొల్లూరు లో జన్మించారు.. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ కి రెండవ ముఖ్యమంత్రి.  అఖిలభారత కాంగ్రెస్ అద్యక్షుడిగా కూడా ఉన్నారు. కేంద్రప్రభుత్వంలో కూడా మంత్రిపదవి  నిర్వహించారు.    

వర్ధంతులు        

ఫిబ్రవరి 9

శ్రీ చిట్టిబాబు : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. కర్ణాటక సంగీతంలో చెప్పుకోదగ్గ ప్రముఖ వైణికులలో  వీరొకరు.. వీరి  గొప్పతనం తన జీవితకాలంలోనే చారిత్రక పురుషునిగా చరితార్థుడు కావడం. వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డారు.  వీరు ఫిబ్రవరి 9, 1996 న స్వర్గస్థులయారు.     

ఫిబ్రవరి    11

శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు :  ప్రముఖ నేపధ్య గాయకుడు.  చాలా సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా చేసారు.  వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు వారిలో అత్యంత ప్రజాదరణ పొందినది. వీరు ఫిబ్రవరి 11, 1974 న స్వర్గస్థులయారు.

ఫిబ్రవరి  12

శ్రీ పువ్వుల సూరిబాబు:  సుప్రసిద్ధ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త.  సుమారు 1500 కి పైగా నాటకప్రదర్శనలు ఇచ్చారు. కొన్ని పౌరాణిక  తెలుగు సినిమాల్లో కూడా నటించారు. వీరు ఫిబ్రవరి 12, 1968 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
romantic cartoons