మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
ఈ వారం ముఖ్యమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోవడం విషయం పట్ల మక్కువను కలిగి ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. గతంలో చేపట్టిన పనులకు సమాధానం చెప్పవలసి రావోచ్చును. సిద్ధంగా ఉండుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో మీకంటూ సొంత అభిప్రాయాలను కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకు సైతం అధికంగా ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
ఈవారం బంధువుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. దూరప్రదేశంలో ఉన్న మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. మీ మాటతీరులో కొంత మార్పుకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈవారం మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. చిన్న చిన్న విషయాల్లో మీ ఆలోచనలకు పెద్దలనుండి గుర్తింపును పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. గతంలో మీకున్న పరిచయాలు మీకు ఉపయోగపడుతాయి. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. నలుగురిని కలుపుకొని వెళ్ళండి.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
ఈవారం పెద్దలతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరమైన విషయాల్లో కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభించే ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. స్త్రీ పరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. అనవసరంగా మాటపడవలసి వస్తుంది, కాస్త జాగ్రత్త అవసరం.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈవారం ఆరంభంలో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన, సొంత నిర్ణయాలు వద్దు. చేపట్టు పనుల విషయాల్లో ఏమాత్రం తొందరపాటు కానీ అశ్రద్ధ కానీ వద్దు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. తల్లి తరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, కావున కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వాహనాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. సోదరులతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం పెద్దగా ఆశించిన మేర ఫలితాలు ఇవ్వకపోవచ్చును. చర్చలకు దూరంగా ఉండుట సూచన.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
ఈవారం ఉద్యోగంలో బాగాఉంటుంది, అధికారులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. కుటుంబపరమైన విషయాల్లో మాత్రం ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆలోచనలు తగ్గించుకోవడంలో విఫలం అవుతారు. విభేదాలు పెరుగుటకు ఆస్కారం ఉంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, మిత్రులను కలుస్తారు.
.
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
ఈవారం మిత్రులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. బంధువులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగివస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, జాగ్రత్తలు తీసుకోండి.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
ఈవారం బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆస్కారం ఉంది. మీ మాటతీరు మీకు మంచి పేరును తెచ్సిపెడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులనుండి ఆశించిన సహకారం లభిస్తుంది.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
ఈవారం మిత్రులతో సమయం సరదాగా గడుపుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు, వారినుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. అధికారుల నుండి లేక పెద్దల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వాహనాలను లేదా స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధువులను కలుసుకుంటారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
ఈవారం ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కాసింత జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.
మీన రాశి : (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )
ఈవారం ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది. నూతన అవకాశాలు పొందుతారు. చర్చాపరమైన విషయాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును , కొంత మొండి నిర్ణయాల వలన లబ్దిని పొందుతారు.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
|