మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
ఈవారం ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. తండ్రితరుపు ;బంధువులను కలుస్తారు, వారినుండి వచ్చిన విషయాలపై లోతుగా ఆలోచన చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న పెట్టుబడులు సులువుగా అందుతాయి. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, మీ ఆలోచనలు వారితో పంచుకుంటారు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం సూచన. ఆరోగ్యం విషయాల్లో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
ఈవారం నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. కోపం పెరుగుటకు అవకాశం ఉంది, కాస్త ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో బాగుంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఆత్మీయులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళలనకు గురిచేస్తుంది.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈవారం కుటుంబపరమైన విషయాల్లో నూతన విషయాలపై చర్చలకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొంత శ్రమ, అలాగే పనిభారం ఉంటుంది. సంతానం విషయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ, పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. వాహనాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. అగ్నీపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట మంచిది.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
ఈవారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనుల విషయాల్లో స్పష్టత ఉండుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ముందుకు సాగకపోవచ్చును. సాధ్యమైనంత మేర వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవడం సూచన. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. సంతానం విషయంలో నూతన నిర్ణయాలకు ఆస్కారం ఉంది. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు ఆస్కారం ఉంది. ఖర్చులకు తగిన ధనం చేతికి అందుతుంది.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో తడబాటు పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన మంచి గుర్తింపును పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుటలో కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. వ్యాపార పరమైన విషయాల్లో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వండి. చిన్న చిన్న విషయాలకే హైరానా చెందుటకు అవకాశం ఉంది. దూరదృష్టిని కలిగి ఉండుట , ఆలోచనల్లో స్పస్టత అలాగే బంధువులతో మాటపట్టింపులకు వెళ్ళకపోవడం అనేది మేలుచేస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, గతంలో చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుటకు ఆస్కారం కలదు.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
ఈవారం ఆరంభంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. రావాల్సిన ఆర్థికసాయం కాస్త ఆలస్యంగా వస్తుంది. పెద్దలనుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. నూతన ఆలోచనల కన్నా గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన.
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
ఈవారం పెద్దలనుండి నూతన తెలుసుకుంటారు. చేపట్టు పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. బంధువులను కలుసుకుంటారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. సంతానం గురుంచి నూతన నిర్ణయాలను తీసుకుంటారు. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
ఈవారం ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి, చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తాయి. విదేశాల్లో ఉన్న బంధువులు లేదా మిత్రుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో మీరు సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
ఈవారం సమయాన్ని వృధాచేసే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చిన్న చిన్న విషయాలకే ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం మంచిది. విదేశాలలో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది , వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
ఈవారం కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. తండ్రితరుపు బంధువులను కలుసుకుంటారు , వారితో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.
మీన రాశి : (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )
ఈవారం పెద్దల నుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఒకింత ఇబ్బందులు కలుగుతాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. సంతానం గురుంచి గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. పెద్ద పెద్ద పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగటంలో ఆటంకాలు కలుగుతాయి. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభ్సితుంది. మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
|