Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ గారితో ముఖాముఖి - ..

Interview with Lyricist Sirasri.

కళాకారుడికి కులం లేదు, మతం లేదు, మనసు లేదు, ఉండకూడదు కూడా...ఉన్నా అవన్నీ తన పర్సనల్ డైరీకే పరిమితం కావాలి. ప్రొఫెషనల్ గా రాముడు పిలిచి పని అప్పగిస్తే రావణుడిపై అక్షరాల్ని ఎక్కుపెట్టాలి, రావణుడు పిలిచి అడిగితే రాముడిపైకీ అంతే పదునైన అక్షరాల్ని సంధించాలి..ఈ విషయాల్ని కుండబద్దలు కొట్టి చెప్పారు గీత రచయిత సిరాశ్రీ. ఈమధ్య ఎక్కడ చూసినా ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్. టాకే. అంతకంటే గొప్ప విశేషం ఏమిటంటే ఆ సినిమా పేరు వినగానే అందరి చెవుల్లో మారుమోగుతున్న పాట..." దగా....కుట్ర...." ఈ ఒక్క పాటనే కాదు ఈ సినిమాలో పాటలన్నీ సిరాశ్రీ కలం నుండి జాలువారినవే...ఆనాటి పరిస్థితులను వర్మ తన క్రియేటివిటీతో విజువలైజ్ చేయగా సిరాశ్రీ తన పదునైన పదాలతో అద్భుతమైన పాటలుగా మలిచారు.

అయితే, ప్రతి విషయానికీ నెగిటివ్, పాజిటివ్ కోణాలు ఉంటాయి. వర్మ
గారితో  కలిసినప్పుడు సిరాశ్రీ కీ ఆ నెగెటివ్ స్పందన కొంత తప్పలేదు... అదే, మరీ డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పైకి గురిచూసి వదిలినట్లున్న ఈ పాట రచనకు ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి భారీగా పారితోషికం అందిందని...అందులో నిజమెంత? అసలు ఈ పాటకు సిరాశ్రీకి ఎవరి నుంచి పారితోషికం అందింది అనే ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు సిరాశ్రీ. ప్రముఖ వెబ్ చానెల్ గోతెలుగు.కాం కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఇంటర్వ్యూ చేసింది సిరాశ్రీకి మిత్రులు, గోతెలుగు సారధి బన్ను గారే. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే తమ మధ్య ఉన్న స్నేహంతో కాకుండా వీక్షకుల తరపున రూమర్లనే ప్రశ్నలుగా సంధించి సిరాశ్రీగారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు...సిరాశ్రీగారు కూడా అంతే ఓపెన్ గా వాస్తవాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మరి

-మాధవ్

మరిన్ని శీర్షికలు
chamatkaram