మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది 'మహర్షి'. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న దర్మిలా అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ బాగా జరిగింది. అంచనాలకు మించి బిజినెస్ జరిగినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. అశ్వనీదత్, పీవీపీ బ్యానర్‌తో కలిసి దిల్‌రాజు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓవర్సీస్‌లో 12 కోట్లు వరకూ 'మహర్షి' బిజినెస్ జరిగినట్లు సమాచారమ్. అసలే ఓవర్సీస్ కింగ్‌గా మహేష్‌బాబును అభివర్ణిస్తుంటారు. 'మహర్షి' ప్రీ రిలీజ్ బిజినెస్సే ఈ రేంజ్‌లో ఉంటే, సినిమా పక్కా హిట్ అని నిర్మాత దిల్‌రాజు ఈ సినిమా విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇదిలా ఉంటే 'మహర్షి'పై ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్నా, పూర్తి కావల్సిన షూటింగ్ ఇంకా పెండింగ్‌లోనే ఉందనీ, రెండు పాటలతో సహా మరికొన్ని ఇంపార్టెంట్ సీన్లు పెండింగ్ ఉన్నాయనీ, రిలీజ్ డేట్ లోపల ఈ పెండింగ్ వర్క్ కంప్లీట్ కావడం అసాధ్యమే అంటున్నారు.
మరోసారి 'మహర్షి' వాయిదా పడుతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా మహేష్ స్టామినా ముందు ఇలాంటి గాసిప్స్ అన్నీ బలాదూర్. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుండగా, పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
|