నటించడం అనేది తేలిక కాదు. సినిమాలు తీయడం లో అనేక కష్ట నష్టాలుంటాయి. అయినప్పటికీ నటి అమలాపాల్ నిర్మాతగా బాధ్యతలు తీసుకుంది. దక్షిణాదిలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అమలాపాల్ మళయాళీ. తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం క్యాడవర్ అనే సినిమాను నిర్మిస్తోంది. ప్రధాన పాత్రని తానే పోషిస్తోంది. కథ తనకి బాగా నచ్చిందని, నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడం తో తానే నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. ఆమెతో పాటుగా మరో ఇద్దరు భాగస్వాములుగా చేరారు. సైంటిఫిక్ త్రిల్లర్ కథ తో తీస్తున్న ఈ చిత్రం తో అమలాపాల్ కు పూర్వ వైభవం తిరిగొస్తుందని బావిద్దాం.
|