Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Excitement

ఈ సంచికలో >> శీర్షికలు >>

హ్యూమరసం - వారణాసి రామకృష్ణ

చూస్తూ చూస్తుండగానే కూల్ గా హాట్ హాట్ సమ్మర్ ప్రవేశించింది. సమ్మర్ అనగానే  కుమ్మరి కుండలు మనకి గుర్తుకు రావటం సహజం . దప్పిక తీరాలంటే చల్లగా కుండలో నీళ్ళు తాగాలీ అనుకుంటాం.కొందరు కుండలు వాడటం పాత ఫ్యాషన్ ఆదిమానవుడి లక్షణం, ఫ్రిజ్ లు కూలర్లలో నీళ్ళు తాగటమే కరెక్ట్టు అoటారు. మాంచి ఎండల్లో నీళ్ళు చల్లగా ఉంటేనే లోపలి దిగేది! అంటే వేడి నీటిని (ద్రవాన్ని) చల్ల బరచటం అనే ప్రక్రియ కుండ విజవంతంగా చేస్తుంది. ఐతే ఆధునీకం పేరుతో ఫ్రిజ్ లో నీళ్ళు తాగి ఆరోగ్యాలు చెడిపోతు న్నాయి అని విజ్ఞులు సెలవిస్తారు అప్పట్లో ఈ కూలర్లు ఫ్రిజ్ లు లేని కాలం లో మనుషులు సుబ్బరంగా అన్నీ ప్రకృతి ప్రసాదించిన వాటితోనే తయారుచేసి వాడుకుని కలకాలం హాయిగా ఉన్నారనీ చెప్తారు. కావాలంటే మీరు మ్యూజియంలో చూడండి అప్పట్లో మన పూర్వీకులు చక్కగా అన్నీ కుండల్లో మట్టి పెంకుల్లో వంటలు చేసుకుని మంచి నీరు తాగేరని ఆనవాళ్ళు చూపుతారు. దీనికి విరుగుడుగా ఆధునీకులు అప్పట్లో మనిషికి ఎలా బ్రతకాలో ఎంత హాయిగాజీవించాలో తెలీకనే అలాంటివి వాడాడు ఇప్పుడుఅన్నీదొరుకుతున్నాయి అవేఎందుకూ? ప్రశ్నిస్తారు.

ఒకడు ఒకటి చెప్తే ఇంకోడు దాన్నికాదంటూఇంకోవాదం లేవదీస్తాడు.ఇలా వాద ప్రతివాదాలు శృతి మించి ఆఖరికి ఎక్కడో ఒకచోట “కుండ బద్దలవు తుంది”! అవును! అందుకే బద్దలు కొట్టటానికే ‘కుండ’ పుట్టింది. గమనిస్తే ప్రపంచంలో ప్రతిచోటా అబద్దం అల్లుకుపోతూoటే వాస్తవం కల్పించుకుని నిజ౦ అనే ‘కుండ బద్దలు’ అవుతుంటుంది. కుండ బద్దలయ్యిందీ అంటే అక్కడ ఇంకే అవాస్తవం మిగల్లేదని!

ఆ.. మట్టి కుండ! అదెంత?దాని విలువెంత?జీవిత కాలమెంత? అని అనేస్తాం కానీ కుండశక్తీ నిజానికి పెద్ద బండకీ లేదు,ఉండదు! అంచేత బండ గుర్తు పెట్టుకుందాం నిండు ”కుండ” తొణకదు అది ‘పవర్ ఫుల్లు!’

 

***      *****     ****

ఇంకా కుండ అంటే చిన్న చూపు ఉన్నవాళ్లకి తెలుగు సినిమాలు చూపిద్దాం. సినీమా వాళ్లకి కుండ కాసులు కురిపించే కామధేనువు!బోలెడన్ని సినిమాల్లో కేవలం కుండల వల్లే హౌస్ ఫుల్ కలెక్షన్లు వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో వందల వేల కుండల్ని వరుసగా అందంగా పేర్చి ఆ కుండల నడుమ నృత్యం చెయ్యటం వల్లే మనిషా కోయిరాలాకి అందాల తార అన్న పేరు వచ్చింది.ఆ సినిమా రెండొందల రోజులు ఆడింది! అదేగాని అక్కడ కుండలకి బదులు ఏ మొద్దు రాచిప్పలో అల్యుమినియం సత్తుగిన్నెలో వాడి ఉంటే పిచ్చెర్ అట్టర్ ఫ్లాపు కొట్టేది.ఇక బోల్డన్ని సినిమాల్లో ఇంతెత్తున పేర్చిన కుండల దగ్గర హీరో రౌడీల్ని పట్టుకుని ఉతికి ఆరేసి సివర్లో డిషిండిషిం కొడితే ఒక్కోడు వెళ్లి కుండల మీద పడటంకుండలు డమాల్ డమాల్ మని బద్దలు కావటం వల్లే ఆ పిచ్చేర్లన్ని రికార్డుల్ని బద్దలుకొట్టాయి. స్టంట్ సీన్లు అంటే బోలెడన్ని కుండలు బద్దలు కావటం కంపల్సరీ! కుండలు పగలటం వల్లే సినిమాలు హిట్టవుతాయి! సరిగ్గా ఈ సెంటిమెంట్ వర్క్అవుట్ అయ్యి స్టార్ ప్రొడుసర్లు ప్రతి సినిమాలోకుండలు పగలాల్సిందేనని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తారు.‘కుండలా మజాకా?!’ ఈ టైటిల్ తో ఇంకా పిచ్చేర్ రాలేదు ఎవరైనా చాంబర్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

****     ****    ****

వీధి కుళాయిల దగ్గర కుండలు గుండెలు పగిలేలా ఏడుస్తుంటాయి!గాంధీ గారు చెప్పినట్టు ప్రకృతి మనిషికి అన్నీ ఇచ్చింది కానీ మనిషి తనకున్నఅత్యాశ వల్లే అనర్ధం జరుగుతున్న సంగతి అర్ధం అవుతుంది. నల్లాలో రోజు నీళ్ళు వస్తాయి.అయినా కొందరు ఉన్ననీళ్ళు కుండ ల్లోంచివంపి కుళాయి దగ్గర నిలబడ్డ స్త్రీలని తోసి మరీ పట్టుకుంటారు.దాంతో అక్కడ ‘పానీ పట్టు’ యుద్ధం జరిగి బోల్డు కుండలు పగులుతాయి! ‘కుండలు గుద్దినకాపురo’ లో కన్నీరు పెడుతూ రోడ్డు మీద వృధాగా నీరుపోతుంటుంది.

***    ****    ***

రాజకీయం చెయ్యాలి అంటే మనిషికి కండలు, గట్టి గుండెలు కాదు వొట్టి మట్టి కుండలు ఉంటే చాలు! బాగా ముదిరిన ఏ రాజకీయ నేతని అడిగినా ఈ ముక్క కుండపగల గొట్టిమరీ నిజమేసుమీ అంటాడు. ఖాళీ కుండ కి పవర్ కట్టబెట్టగల పవర్ ఉంది! అదెలాగో చూద్దాం-

ఒక నాయకుడు పదేళ్ళు కష్టపడి అధిష్టానం దగ్గర ప్రాపకం సంపాయించి సీఎం అవుతాడు . కానీ ఎప్పటినుంచో ఆ పదవి మీద కన్నేసిన స్వపక్ష నేత చేదు మింగలేక కక్కలేక ఇంటి కెళ్ళి కుండ లో నీళ్ళు ముంచుకుని తాగుతాడు.సరిగ్గా అప్పుడే .. కుండలో చెయ్యి గ్లాసు ముoచుతున్నప్పుడే అతగాడికి సి ఎం పదవి లో వున్న నేతని ఎలా ముంచాలో ఉపాయం తడుతుంది.ఆరకంగాఅతగాడికి ‘కుండ’ మార్గం చూపుతుంది.‘ఆహా చిక్కవురానాకుండలో! నీ పదవికి ఎసరు పెట్టె రోజు వచ్చెసింది! ‘ మనసులో నవ్వుకుని అప్పటికి ఊరుకుంటాడు. అసెంబ్లీ సెషన్ నడుస్తుండగా జీరో అవర్ మధ్యలో వెయ్యి మంది మహిళలు సరిగ్గా అసెంబ్లీ ఎదుట ఖాళీ కుండలు పట్టుకొచ్చి ప్రదర్శన చేస్తారు. తాగటానికీ నీళ్ళు దొరకడం లేదనీ ఈ ప్రభుత్వం చేతకాని దద్దమ్మలా చూస్తూ ఊరుకుందని గట్టిగా గగ్గోలు పెడతారు.ఈ కేకలు అసెంబ్లీ లోపల  ప్రతిధ్వనిస్తాయి! ప్రతిపక్ష నేత ఇన్నాళ్ళకి దొరికాడ్రా అడ్డంగాసీఎం అని సంబరంగా ప్రభుత్వాన్ని దుయ్యబట్టటం మొదలెడతాడు. దాంతో ఏం జవాబు ఇవ్వాలో అర్ధం కాక సీఎం కి ముందు చెమటలు పడతాయి. తర్వాతా బీపి షుగర్లు వస్తాయి. కుండ దెబ్బకి సీఎం కుర్చీ కదులుతుంది! జనానికి నీళ్ళే ఇవ్వలేని నీకు సీ ఎం పదవి ఎందుకయ్యా దండగ! అధిష్టానం పీకేస్తుంది. అప్పుడు మన కుండల నేత నవ్వుకుని గ్లాసుడు నీళ్ళు కుండ లోంచి తెప్పించి సీఎంకి ఇస్తాడు! ఆనక కుండ నేత అధిష్టానం దగ్గరికి వెళ్ళి కుండలో విస్కీ కలిపి స్పెషల్ విలేజ్ విస్కీ తెప్పించా అంటాడు! ఆనక మత్తు దిగటం కోసం కుండ లోంచి చల్లటి మజ్జిగ తీసిచ్చి ‘మీరేం వర్రీ అవకండి సార్! మై హు నా ‘ కుండ బద్దలు కొడతాడు! దాంతో అధిష్టానం కుండలప్రదర్శన సూత్రధారికి పదవి కట్టబెడుతుంది.కుండ పాచిక వర్క్ అవుట్ అయ్యిందని కుండనేత తన అధికారిక ప్యాలెస్ లో గోల్డెన్ కుండనొకటి తయారు చేయించి నిత్యం అభిషేకం చేస్తూ ‘అమ్మా కుండమాతా! అంతా నీదయ!’ అంటూ ఇంటి ఇలవేలుపుగా కుండ గుర్తునే కొండగుర్తుచేసి మరో నేత ఎవ్వరూ కుండ రాజకీయాలు చెయ్యకుండా జాగ్రత్త పడతాడు! ఇంటెలిజెన్స్ కి చెప్పినిత్యం కుండనివేదికలు తెప్పిస్తాడు! ఆరకంగా‘ఖాళీకుండ’ రాజకీయులకి మార్గదర్శి! చిట్ ఫండు గురించి చెప్పడం లేదని విజ్ఞులు గ్రహించాలి.

*****     *****      ******

రాజకీయుల్లో ఇంకొందరు కుండలు పట్టుకుని భలే జిమ్మిక్కులు చేస్తారు! చూసే జనo కి

అర్ధం కాక తేలిగ్గా నవ్వుతారు గానీ వాళ్ళరాజకీయచర్యలు కుండoత దృడంగా ఉంటాయి. అప్పట్లో తెలుగాళ్ళు సమైక్యoగా ఉన్నప్పుడు సెపరేటు తెలంగాణా ఉద్యమం మొదలైంది. ఉద్యమకారులు కుండల ప్రదర్సన చేసి ‘కుండ బద్దలు కొట్టి చెప్తున్నాం! ప్రత్యక తెలంగాణా సాధిస్తాం!  అని తలకో కుండ చొప్పున దడేల్ దడేల్ మని రోడ్డు మీద పగులగొట్టారు. చూసిన కొందరు పిచ్చోళ్ళులే అని నవ్వుకున్నారు.ఆ తర్వాత కొందరు  పెద్దలు ‘పోనీయ్యండి రెండుగా విభజిస్తే ఒక పనై పోతుంది’ అoటున్న రోజుల్లో ‘సీమ హక్కుల సాధనాసమితి‘  ధనా ధనా మని ప్రారంభం అయ్యింది. వాళ్ళు కర్నూల్ లో ఒక హోటల్ లో కుండలు చేత పట్టుకుని సమావేశమయ్యి ‘ఎవరికి తోచినట్టు వాళ్ళు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే మజ్జిలో మా గతి ఏంటని’ ప్రశ్నించారు. అక్కడితో ఆగక టేబుల్ మీద వరుసగా కుండలు పేర్చి ‘రాయలసీమ హక్కుల సాధనకు పూనుకుంటామని కుండ బద్దలు కొట్టి స్పష్టం చేస్తూన్నాం’  అంటూ ఫటా ఫట్ మని కుండలు పగులగొట్టారు. చూశారా, మట్టి లోంచి తయారయిన కుండ వేడి నీటినే కాదు వేడివేడి ఆలోచనల్నీ సానబెట్టి ఎలాఆచరణకి పూనుకునేలా చేసి కావాల్సిన పనులు సాధించి పెడుతుందో?! భావి తరాల ఉద్యమాలకి కుండ ఆదర్శం! మనిషి పుట్టుక కుండ తో ప్రారంభం! కుండ తోనే సమాప్తం! మనిషి పోయాక కుండనే ఆఖర్లో బద్దలు కొట్టేది.

అంసేత సివరాకరికి సెప్పొచ్చేదేoటంటే అయ్యా ఆబ్లిక్ అమ్మా!ఇకనుంచికుండని తక్కువగా అంచనా వెయ్యకండి!గుండెని కాపాడుకున్నట్టు కుండ ని రక్షించుకుందాం!

జై కుండ! జిందాబాద్,జిందాబాద్ ‘కుండ’ జిందాబాద్!!

 

 

మరిన్ని శీర్షికలు
weekly-horoscope may 3rd to may 9th