Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

పంచరత్నాలు - జీడిగుంట నరసింహ మూర్తి,..

 

 

1.ఒక ప్రవచనా కారుడు మరొకరితో  :  “  నేను “ ప్రవచనాలు చెప్పబడును “ అని పొట్ట పోషించుకోవడం కోసం  టికెట్ పెడితే  నా వ్యాపారం దెబ్బతియ్యడానికి నువ్వు నాకెదురుగా” ఫ్రీవచనాలు “ చెప్పబడును  అని బోర్డు పెడతావా ?”

****

2.“నిన్న మా మామగారు మతిమరుపుతో చనిపోయారు ?”
“  అదేమిటి విడ్డూరంగా వుందే ?”
“ అవును ఒక అరగంటసేపు వూపిరి పీలవడం మరిచిపోయాడు “


****
3.“ నీ జీవితంలో తలనొప్పి అంటూ కూడా ఎప్పుడూ ఎరగను అన్నావుగా మరి ఒక నెలరోజుల క్రితం అదేదో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో కనిపించావ్ ?”
“ ఏమి లేదు . నాకు అప్పుడు బ్రైన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందిలే “


****
4.“ ఎడం చేత్తో  షేక్ హాండ్  ఇవ్వకూడదని తెలియదా ?”

“ మరేం చెయ్యమంటావ్ కుడిచేతికి లక్షరూపాయల ఖరీదు చేసే వుంగరాలు వున్నాయి మరి “

****

5.గోపాలం మాస్టారికి నుదుటిమీద  గోళీకాయంత కణిత వుండేది. ఆయన క్లాసులోకి రాగానే పిల్లలంతా “గోళీగారు” వచ్చారు అంటూ గట్టిగా అరుస్తూ వుండేవారు.  ఈ బాధ పడలేక ఒకరోజు ఆయన ఆ “గోళీ” కాస్తా ఆపరేషన్ చేయించుకుని చక్కా వచ్చారు. అంతే   “ కట్ గోళీ గారు వచ్చారు “ అంటూ క్లాస్ రూమ్ మార్మోగిపోయిం
ది.    

 

 

మరిన్ని శీర్షికలు
Spirit of the Ardhanarishvara soul ....