విజయ్ దేవరకొండ అనే పేరులో ఏదో మ్యాజిక్ ఉంది. అతని ఆటిట్యూడే ఆ మ్యాజిక్. ఎవరైనా సరే ఆ మాయలో పడిపోవాల్సిందే. ఇప్పుడు ఏకంగా 'కడలల్లే..' ముంచెత్తేశాడు. మత్తెక్కించే ఆ ఉప్పెనలో చాలా మంది కొట్టుకుపోయారు. విషయమేంటంటే, విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' నుండి ఓ అద్భుతమైన ఆడియో సింగిల్ బయటికి వచ్చింది. వినగానే ఓ మైకంలోకి వెళ్లిపోతాం. సిద్ధ్ శ్రీరామ్, ఐశ్వర్యా రవిచంద్రన్‌ల వాయిస్ ఆ పాటకు ఓ హైలైట్ అయితే, జస్టిన్ ప్రబాకరన్ మ్యూజిక్ మరో ఆకర్షణ. వీటన్నింటికీ మించి విజయ్ దేవరకొండ, రష్మికల కెమిస్ట్రీ మనల్ని కడలి లోతుల్లోకి తీసుకెళ్లిపోతుంది. 'గీత గోవిందం' సినిమాతో బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన మ్యాజిక్ చేసిన ఈ జంట, 'డియర్ కామ్రేడ్' సినిమాతోనూ అంతకు మించిన మ్యాజిక్ చేయాలని అనుకుంటోంది. ఎన్నిసార్లు చూసినా, మళ్లీ చూడాలనీ, ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఆడియో సింగిల్‌ని తీర్చి దిద్దారు.
ఇంట్లో ఈ పాటను ప్లే చేస్తే విజయ్ తల్లి కళ్లు చెమర్చాయట. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించాడు. ఈ పాట వింటే ఎవరైనా తన్మయత్వానికి లోనవ్వాల్సిందే. కడలి లోతుల్లోకి నిజంగానే తీసుకెళ్లిపోయాడు ఈ 'డియర్ కామ్రేడ్'. అందుకే ఈ సాంగ్‌ని రిలీజ్ చేయడానికి ముందే 'సాంగ్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించేశాడు రౌడీ హీరో. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా నాలుగు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అనిపించుకుంటోంది.
|