యంగ్ హీరో రామ్ అంటే ఏంటో అందరికీ తెలుసు. కానీ ఈ సారి మాత్రం పూరీ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు రామ్. మేకోవర్ పరంగా రామ్‌కి చాలా చాలా కొత్త క్యారెక్టర్ ఇది. ఆటిట్యూడ్ పరంగా అంతకన్నా కొత్త క్యారెక్టర్. ఇంతవరకూ రామ్ చాలా సినిమాల్లో ఆటిట్యూడ్ చూపించాడు. కానీ ఈ రేంజ్‌లో ఎనర్జీ లెవల్స్ మాత్రం ఈ సినిమా కోసమే. ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో అర్ధమై ఉంటుంది కదా. రామ్ తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' గురించి. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి పిచ్చ పిచ్చగా రెస్పాన్స్ వచ్చేస్తోంది. పక్కా హైద్రాబాదీ స్లాంగ్‌లో డైలాగులు పలుకుతున్నాడు ఈ సినిమాలో. అదేంటీ. హైద్రాబాదీ స్లాంగ్‌లో చాలాసార్లే రామ్ మాట్లాడాడు కదా.. అనుకుంటే పొరపాటే, ఇది పాత బస్తీ స్లాంగ్. దేత్తడీ పోచమ్మ గుడి అన్న మాట. 'నీ యమ్మా..' అంటూ బూతులు కూడా పలికించాడు రామ్ నోట పూరీ.
ఇక పూరీ విషయానికొస్తే, ఈ మధ్య వచ్చిన 'మెహబూబా' తప్ప దాదాపు పూరీ సినిమాలన్నీ రఫ్ నోట్‌లోనే కనిపిస్తున్నాయి. కొత్త హీరో, అగ్ర హీరో అనే తేడా అస్సలు చూపించడం లేదు పూరీ. 'రోగ్'లో కొత్త కుర్రాడు ఇషాన్ బాడీ లాంగ్వేజ్ తీసుకున్నా, 'పైసా వసూల్'లో అగ్ర హీరో బాలయ్య బాడీ లాంగ్వేజ్ చూసుకున్నా ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్'గా రామ్ తీరు చూసినా ఆ మాటికొస్తే, పూరీ తొలి సినిమా నుండీ ఏ హీరోని తీసుకున్నా ఆయన తీరు మాత్రం అదే. ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్'లో రామ్‌ని చూశాక మాత్రం పూరీ ఫ్యాన్స్ కొంచెం ఫీలవుతున్నారట. పూరీ తీరు మార్చుకుంటే బాగుండని ఆశిస్తున్నారట. చూడాలి మరి, రామ్‌తో పూరీ 'ఇస్మార్ట్'గా హిట్ కొడతాడా.? లేక ఎప్పటిలాగే సరిపెట్టుకుంటాడా.?
|