'పేరు గుర్తుంది కదా.. గబ్బర్ సింగ్..' అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ అయితే, మరి ఈ కొత్త భామ ఐడెంటిటీ తెలుసు కదా. మైకు పట్టుకుని అన్ని సార్లు చెప్పాకా గుర్తుండక చస్తుందా.? చెప్పండి. అదేనండీ ఎవరి గురించి చెబుతున్నామో గెస్ చేశారా.? 'నా పేరు శ్రద్ధా శ్రీనాధ్.. నా పేరు శ్రద్ధా శ్రీనాధ్' అంటూ పదే పదే చెప్పుకుంది కదా.. కన్నడ బ్యూటీ 'శ్రద్ధా శ్రీనాధ్'. 'జెర్సీ' భామ అంటే బాగా తెలుస్తుంది కాబోలు. అవును ఆ అమ్మాయే. 'జెర్సీ' తర్వాత ఈ అమ్మాయి జోరు బాగా పెరిగింది. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అంటారు. అమ్మడు చేసిన హడావిడికి సినిమా విడుదలయ్యాక అంత సీను ఉండి ఉండదులే అనుకున్నారంతా. కానీ అమ్మడు అచ్చంగా నిజమే చెప్పేసిందండోయ్.
నిజ్జంగా తన క్యారెక్టర్‌తో అందర్నీ ఇంప్రెస్ చేసేసింది 'జెర్సీ'లో. ఇక త్వరలో తెలుగులో 'జోడీ' సినిమాతో రాబోతోంది. తాజాగా తమిళంలో అమ్మడు న్యూ ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది. అదే తమిళ స్టార్ హీరో విశాల్‌తో 'ఇరుంబుతిరై 2'. తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో విడుదలైన సినిమాకి సీక్వెల్ ఇది. 'అభిమన్యుడు'లో సమంత నటించింది. ఆ ప్లేస్‌లోనే సీక్వెల్‌లో ఇప్పుడీ భామ నటిస్తోంది. ఆల్రెడీ మరో స్టార్ హీరో అజిత్ సరసన 'పింక్' రీమేక్‌లో నటిస్తోంది శ్రద్ధా శ్రీనాధ్. తెలుగులో తొలి సినిమాకే ఇంత హంగామా చేసిన ఈ భామ, ఇక తమిళంలో వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంటోంది. అక్కడ ఇంకెంత హంగామా చేస్తుందో చూడాలి మరి.
|