నిజానికి మహేష్‌బాబు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు తన సినిమాల విషయంలో. అయితే 'మహర్షి' విషయంలో మాత్రం కాస్త ఎక్కువగా ఎగ్జైట్ అయ్యాడు. అందుకూ కారణం లేకపోలేదు. 'మహర్షి' విడుదలకు ముందు భారీగా అంచనాలున్నాఇయ. కానీ విడుదలయ్యాక మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మిక్స్‌డ్ టాక్‌తోనే వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సిట్యువేషన్ ఇలా ఉండడంతో మహేష్ కంట్రోల్ తప్పినట్లున్నాడు. ఎగ్టైట్‌మెంట్ ఆపుకోలేకపోయాడు కాబోలు. అందుకే డైరెక్టర్‌ని ముద్దాడేశాడు. కాలర్ ఎగరేసేశాడు. 'భరత్ అనే నేను' వసూళ్లలో కొంత గందరగోళం నెలకొంది. ఒరిజినల్ వసూళ్లకు మించిన లెక్కలు ప్రచారం చేశారు. కానీ ఆలాంటి తప్పులు ఈ సినిమాకి దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ప్రస్తుతం వసూళ్లు జోరుగానే ఉన్నాయి. స్లోగా స్టార్ట్ అవ్వడంతో ఇంకా ఈ లెక్కలో కొంచెం వేగం తగ్గింది కానీ, లేదంటే ఈ పాటికే 100 కోట్లు కొల్లగొట్టేసేవాడు 'మహర్షి'. అయినా కానీ, లేట్ అయినా, లేటెస్ట్ అనిపించుకునేలానే ఉన్నాడు 'మహర్షి'. త్వరలోనే 100 కోట్లు దిశగా పరుగులు పెడుతోంది 'మహర్షి'. త్వరలోనే ఆ టార్గెట్‌ని అందుకోవడం ఖాయం. 'ఖైదీ నెం 150'ని ( 105 కోట్లు) దాటేయడం ఖరారైపోయింది. ఇక 'రంగస్థలం' రికార్డుల (127 కోట్లు) పైనే 'మహర్షి' ఫుల్‌గా ఫోకస్ పెట్టింది. ఆ టార్గెట్‌ని అందుకోవడంలో 'మహర్షి' సఫలం అవుతాడో లేదో చూడాలిక. వసూళ్ల సంగతిలా ఉంటే, ప్రముఖుల ప్రశంలు కూడా పుష్కలంగా దక్కుతున్నాయి మరోవైపు 'మహర్షి'కి. లేటెస్ట్‌గా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫ్యామిలీతో కలిసి 'మహర్షి' సినిమా చూసి, చిత్ర యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
|