Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Is she all 'that' movies

ఈ సంచికలో >> సినిమా >>

ప్రెగ్నెన్సీలో హాట్‌నెస్‌ కెవ్వుకేక.!

hotness in pregnency

ఇంతవరకూ గ్లామర్‌కి సంబంధించి అందాల పోటీలే తెలుసు మనకు. ఇకపై బేబీ బంప్‌ పోటీలు కూడా నిర్వహించాలేమో. అవునండీ మీరు విన్నది నిజమే. ఒకప్పుడు అందాల భామలు ప్రెగ్నెంట్‌ అవ్వడమనే విషయాన్ని అస్సలు బయటికి తెలియకుండా జాగ్రత్త పడేవారు. అంత గోప్యంగా ఉంచేందుకు చాలా కష్టపడేవారు. కానీ ఇప్పుడు ఎంతో ఇష్టంగా బేబీ బంప్‌ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఆ కోవలో ముందుగా చెప్పుకోదగ్గ బ్యూటీ సమీరారెడ్డి. ఇప్పుడంటే ఈ భామ సినిమాలు చేయడం లేదు కానీ, ఒకప్పుడు స్టార్‌ హీరోల సరసన సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా మిగిలిన భాషల సంగతి అటుంచితే, తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్‌ వంటి స్టార్స్‌ సరసన ఆడి పాడింది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుండడంతో సినిమాలకు బ్రేకిచ్చేసింది. దాంతో ఈమె ఈ జనరేషన్‌ వారికి అంతగా తెలియకపోవచ్చు.

అయితే ఈ అందాల భామ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చేస్తున్న ఓ రకమైన పబ్లిసిటీ రచ్చ అంతా ఇంతా కాదు. అదేమంటే, బేబీ బంప్‌షో. ఇదేం బేబీ బంప్స్‌ గోల్రా బాబూ..! అని కొన్ని సందర్భాల్లో విసుగు పుట్టించేలా ఈ అమ్మడు రెచ్చిపోయి ఈ టైంలో అందాల ప్రదర్శన చేసేస్తోంది. గ్లామర్‌ అంటే, స్లిమ్‌ లుక్స్‌తో, కనీ కనిపించని నల్లపూసలాంటి నడుముతో కనిపించడమనే భావన. కానీ, ఆ భావనకకు చెల్లు చీటీ ఇచ్చేస్తున్నారు సమీరారెడ్డి వంటి కాబోయే తల్లులు. సిగ్గు పడకుండా బేబీ బంప్‌ పర్సనాలిటీస్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా గ్లామర్‌లో ఇదో ట్రెండింగ్‌ అయిపోయింది. సమీరారెడ్డితో పాటు, అమీజాక్సన్‌ తదితర భామలు కూడా ఈ ట్రెండ్‌ని ఫాలో చేస్తున్నారు. కాదేదీ ఎక్స్‌పోజింగ్‌కి అనర్హం అనే రేంజ్‌లో ఈ ముద్దుగుమ్మలు చేస్తున్న బేబీ బంప్‌ పబ్లిసిటీ న్యూ ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోందిప్పుడు.

మరిన్ని సినిమా కబుర్లు
o baby