Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
hotness in pregnency

ఈ సంచికలో >> సినిమా >>

ఓ బేబీ'.. అందరికీ నచ్చేశావోయీ.!

o baby

సినిమా థీమ్‌ని ట్రైలర్స్‌లో కట్‌ చేయడం తీరు ఈ మధ్య బాగా ఆకట్టుకుంటోంది. ఆ కోవలో తాజాగా వచ్చిన 'ఓ బేబీ' ట్రైలర్‌ అందరి దృష్టినీ బాగా ఆకర్షించింది. కొరియన్‌ సూపర్‌ హిట్‌ 'మిస్‌ గ్రానీ'కి తెలుగు రీమేక్‌గా రూపొందించిన సినిమా 'ఓ బేబీ'. జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా వదిలిన ట్రైలర్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా మొత్తం చూసిన ఫీలింగ్‌ వచ్చేసింది ట్రైలర్‌ చూస్తే. ఏకంగా ట్రైలర్‌ కోసమే ధియేటర్‌కి వెళ్లొస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి ఈ ట్రైలర్‌లో ఫీల్‌ ఏ రేంజ్‌లో ఉందో. ఏమాటకామాటే చెప్పుకోవాలి సినిమా చూసినంత ఫీల్‌ క్రియేట్‌ అయ్యింది ట్రైలర్‌తోనే. 'ఓ బేబీ' సినిమా సమంత కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందనడం అతిశయోక్తి కాదేమో. ఓ సాయంత్రం సన్నని వర్షం వేళ.. 70 ఏళ్ల ముసల్ది 24 ఏళ్ల పడుచు పిల్లలా మారిపోతుంది. ఆ పడుచు పిల్ల అందానికి, చూసిన ప్రతీ కుర్రోడూ సైటేసేస్తుంటాడు.

ఆఖరికి తన మనవడు కూడా ప్రపోజ్‌ చేసేస్తాడు. వయసు 24 అయినా, మనసు మాత్రం 70ల్లోనే ఉండే బేబీకి కొంతకాలానికి దేవుడిచ్చిన వయసు రెక్కలు విప్పుకుంటుంది. ప్రేమను కోరుకుంటుంది. అప్పటికే బేబీని ఓ కుర్రోడు ఇష్టపడతాడు. మరి బేబీ ఆ కుర్రోడ్ని ప్రేమిస్తుందా.? అసలు బేబీ ఎంతకాలం అదే వయసులో ఉండిపోయింది.? తిరిగి తన ఒరిజినల్‌ వయసుకు వచ్చిందా.? లేదా.? ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూడాలి. ఈ సినిమాకి సమంతే స్టార్‌. ఎన్నో పాత్రలున్నా సమంత పాత్ర అందర్నీ డామినేట్‌ చేసేస్తోంది. నందినీ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ ప్రచారం జరిగింది. ఓ నెటిజన్‌ సినిమాని హిట్‌ సినిమా కాదు అని వ్యాఖ్యానించాడు. దాంతో సమంతకు కోపమొచ్చింది. ఆ నెటిజన్‌ని 'ఇడియట్‌' అనేసింది. ఇదో సెన్సేషన్‌ అయ్యింది సోషల్‌ మీడియాలో. అయితే, 'ఓ బేబీ' ట్రైలర్‌ వచ్చాక సినిమాపై నెగిటివిటీ ప్రచారం చేస్తున్న వారికి ఆడియన్సే గట్టి కౌంటర్‌ ఇచ్చేస్తున్నారు. అంతలా ఇంపాక్ట్‌ చూపించింది 'ఓ బేబీ'. సో స్వీట్‌ సమంత. సూపర్‌ రెస్పాన్స్‌ టు 'ఓ బేబీ'.   

మరిన్ని సినిమా కబుర్లు
Careful Director.!