Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
agent sai srinivas atreya movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఆమెకు అన్నీ 'ఆ' సినిమాలేనా

Is she all 'that' movies


భయపెట్టే సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది ముద్దుగుమ్మ నందితా శ్వేత. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈ సినిమాలో దెయ్యం పాత్రలో నందితా నటించిన సంగతి తెలిసిందే. నో నో నటించలేదు.. జీవించేసింది. దాంతో ఆ తర్వాత నుండి కూడా అలాంటి పాత్రలే వస్తుండడం గమనార్హం. అయితే, ఎన్నిసార్లు అదే పాత్రల్లో కనిపించినా బోర్‌ కొట్టించకపోవడం అమ్మడి స్పెషాలిటీ. 'ప్రేమకథా చిత్రమ్‌ 2', 'అభినేత్రి 2' ఇలా ఇటీవల వచ్చిన పలు చిత్రాల్లో నందితా శ్వేత దెయ్యం పాత్రలు పోషించి మెప్పించింది. అసలే హారర్‌కి కామెడీ టచ్‌ ఇచ్చి, సింపుల్‌ బడ్జెట్‌తో సినిమా తీతపై ఆసక్తి ఉన్న పలువురు ప్రబుద్ధులు దర్శకులుగా అవతారమెత్తేస్తున్నారు. లక్‌ చిక్కితే గొప్ప డైరెక్టర్లుగా పేరు తెచ్చేసుకుంటున్నారు కూడా. అలాంటి వారికి నందితా శ్వేత బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది. లిమిటెడ్‌ బడ్జెట్‌తో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఓ మోస్తరు టాక్‌లో నిలుస్తున్నాయి.

అలా నందితాశ్వేత హీరోయిన్‌గా రెండు మూడు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. వాటిలో ఒకటి 'అక్షర'. మొదట్లో ఈ సినిమాని రెగ్యులర్‌ సబ్జెక్ట్‌గానే రివీల్‌ చేశారు. అయితే, తాజా ఇన్‌ఫర్మేషన్‌ ప్రకారం ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌ అనీ తెలుస్తోంది. రచయితగా పేరు తెచ్చుకున్న అమ్మాయి.. ఆ అమ్మాయి రచించే కథలకు, బయట జరుగుతున్న క్రైమ్స్‌కీ పోలిక.. అదే ఊరిలో అల్లరి చిల్లరగా తిరిగే ముగ్గురు కుర్రాళ్లూ వీరందరికీ ఓ క్రైమ్‌ కనెక్షన్‌.. ఇలా ఓ ఇంట్రెస్టింగ్‌ అంశంతో తెరకెక్కుతోంది ఈ సినిమా. సత్య, షకలక శంకర్‌, మధునందన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బి.చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న సినిమా అయినా, క్రైమ్‌ ఎలిమెంట్స్‌ని బాగా తెరకెక్కించారట. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
hotness in pregnency