Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

పిక్చర్‌ పెర్‌ఫెక్ట్‌.. పెన్సిల్‌ పార్ధసారధిగా నాని!

Picture Perfect ..

హీరో నాని విలక్షణమైన సినిమాలు చేస్తుంటాడు. అయినాగానీ, ఎందుకో అతనిలో పక్కింటి కుర్రాడే ఎక్కువమందికి నచ్చుతాడు. అలాగని, విలక్షణ పాత్రలు చేస్తే అతన్ని మెచ్చరని కాదు. ఓ వైపు విలక్షణ పాత్రలు చేస్తూనే, పక్కింటి కుర్రాడి పాత్రల్లో నాని ఒదిగిపోతోంటే ఆ కిక్కే వేరప్పా! అచ్చం అలాంటి పక్కింటి కుర్రాడి పాత్రే పెన్సిల్‌ పార్ధసారధి. ఆయనో రివెంజ్‌ రైటర్‌. రచయిత కదా, ఆయనకీ ఓ కలం పేరు వుంటుంది. ఆ పేరే పెన్సిల్‌. కాన్సెప్ట్‌ అదిరింది కదూ! 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాలో నాని పాత్ర పేరు ఇది. వివిధ వయసులకు చెందిన ఐదుగురు ఫిమేల్స్‌ వున్న గ్యాంగ్‌కి నాని లీడర్‌. సినిమాలో కావాల్సినంత ఫన్‌ జనరేట్‌ అయ్యిందనే విషయాన్ని టీజర్‌లోనే చెప్పేశారు మేకర్స్‌. విలక్షణ చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదలవడంతోనే సోషల్‌ మీడియాలో సంచలనాలు షురూ చేసింది. సీనియర్‌ నటి లక్ష్మి, ప్రియాంక మోహన్‌.. నాని గ్యాంగ్‌లో కనిపిస్తున్నారు. ఎవరికి వారు మంచి టైమింగ్‌తో డైలాగులు అదరగొట్టేశారు. టీజర్‌ చూస్తే ఫుల్‌ ఫన్‌ కన్పిస్తోంది. కానీ, ఇందులో హీరో పెన్సిల్‌ పార్ధసారధి రివెంజ్‌ రైటర్‌. ఆ ఐదుగురు ఫిమేల్స్‌ కూడా, రివెంజ్‌ కోసమే పెన్సిల్‌ పార్ధసారధి సాయం తీసుకున్నారు. ఇంతకీ, రివెంజ్‌ ఎవరి మీద.? ఆర్‌ఎక్‌100 హీరో కార్తికేయ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్పించబోతున్నాడు. బహుశా అతనే విలన్‌ అని అనుకోవాలేమో.!

మరిన్ని సినిమా కబుర్లు
big boss 3