Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Picture Perfect ..

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌బాస్‌-3 తెలుగు: రచ్చ మొదలైంది గురూ!

big boss 3

బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌.. ఈసారి నాగార్జున హోస్ట్‌గా మూడో సీజన్‌తో సర్వాంగ సుందరంగా ముస్తాబై, బుల్లితెర వీక్షకుల ముందుకు వచ్చేసింది. 15 మంది కంటెస్టెంట్స్‌.. వారికి తోడుగా కింగ్‌ నాగార్జున.. ఇకనేం, బుల్లితెరపై కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌. ఓపెనింగ్‌ ఈవెంట్‌ అదిరిపోయింది. కళ్ళు చెదిరే పెర్ఫామెన్స్‌లతో హౌస్‌మేట్స్‌ సత్తా చాటారు. ఆ తర్వాత హౌస్‌లోకి ఎంటరవుతూనే, వివాదాలు షురూ చేశారు. ఈసారి సీజన్‌ ప్రత్యేకత, హౌస్‌మేట్స్‌లో ఓ జంట కూడా వుంది. హీరో వరుణ్‌ సందేశ్‌, హీరోయిన్‌ వితికా షెరు, 'పడ్డానండీ ప్రేమలో' మరి సినిమాలో నటించాక, వైవాహిక బంధంతో ఒక్కటైన విషయం విదితమే. బిగ్‌హౌస్‌లో ఈ ఇద్దరి రొమాన్స్‌ ఇప్పుడు బిగ్‌బాస్‌ రియాల్టీ షో మొత్తానికే హైలైట్‌ అయ్యింది.

మరోపక్క, బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి, తనదైన 'స్పెషల్‌' వాయిస్‌తో బిగ్‌హౌస్‌ టాప్‌ లేపేస్తోంది. 'ఉయ్యాల జంపాల' పేం పునర్నవి భూపాలం, కొరియోగ్రాఫర్‌ భాస్కర్‌, మరో బుల్లితెర నటి రోహిణి, సీనియర్‌ నటి హేమ.. ఇలా ఎవరికి వారే ప్రత్యేకం. ఒకరు తక్కువ కాదు, ఇంకొకరు ఎక్కువ కాదు.. అన్నట్లు 15 మంది కంటెస్టెంట్స్‌ని ఈసారి పక్కాగా ప్లాన్‌ చేశారు. పెర్‌ఫెక్ట్‌ గేమ్‌ ప్లాన్‌తోనే హౌస్‌లో అందరూ అడుగుపెట్టినట్లు కన్పిస్తోంది. గత సీజన్‌లో కౌశల్‌ ఆర్మీ ఒక్కటే యాక్టివ్‌గా పనిచేసింది. ఇప్పుడలా కాదు, చాలా ఆర్మీలు రంగంలోకి దిగేశాయి. కొంచెం కూడా గ్యాప్‌ ఇవ్వకుండా తొలి రోజు నుంచే రచ్చ రంబోలా అన్నట్టు తయారైంది పరిస్థితి. ఫస్ట్‌ వీకెండ్‌ ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్న విషయం పక్కన పెడితే.. వీకెండ్‌ ఎపిసోడ్స్‌ని నాగ్‌ ఎలా రన్‌ చేయబోతున్నాడన్న ఉత్కంఠే ఎక్కువగా కన్పిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
what happend to ranadaggbti