Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
big boss 3

ఈ సంచికలో >> సినిమా >>

రానా దగ్గుబాటికి అసలేమయ్యింది.!

what happend to ranadaggbti

'బాహుబలి' సినిమాలోని బళ్ళాలదేవ పాత్రకు ప్రాణం పోశాడు రానా దగ్గుబాటి. అదొక్కటే కాదు, ఏ సినిమా చేసినా ప్రాణం పెట్టేస్తాడు.. అదీ రానా దగ్గుబాటి ప్రత్యేకత. బుల్లితెరపై హోస్ట్‌గానూ, ఇంకోపక్క నిర్మాతగానూ.. ఇలా రానా దగ్గుబాటిలో యాంగిల్స్‌ అన్నీ ఇన్నీ కావు. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చి, స్టార్‌గా ఎదిగిన రానా.. ఎంత ఎదిగినా ఒదిగి వుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. అలాంటి రానా మీద ఇటీవల చాలా గాసిప్స్‌ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా రానా అనారోగ్యంపై విన్పిస్తున్న వదంతులు అన్నీ ఇన్నీ కావు. 'బాహుబలి' కోసం కండలు పెంచిన రానా, అందులో 'బీస్ట్‌' తరహాలో కన్పించిన సంగతి తెల్సిందే.

సినిమా సినిమాకీ తన ఆహార్యాన్ని మాత్రమే కాదు, ఫిజిక్‌నీ పాత్రకు తగ్గట్టుగా మార్చుకుంటాడు రానా. ఇక్కడే అతని మీద వదంతులకు ఆస్కారం ఏర్పడుతుందా.? ఏమోగానీ, రానా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. అయితే, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుండే రానా, అలాంటి వదంతుల్ని నమ్మొద్దని చెబుతున్నాడు. తాజాగా రానాకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగిందన్న గాసిప్‌ పుట్టుకొచ్చింది. రానా ఈ గాసిప్స్‌పై సీరియస్‌గానే స్పందించాడు. అభిమాని ఒకరు, ఆ గాసిప్స్‌ని ప్రస్తావిస్తే వాటిని నమ్మొద్దంటూ సదరు గాసిప్స్‌పై మండిపడ్డాడు. 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాని అమెరికాలో రిలీజ్‌ రోజునే చూస్తున్నానంటూ ఓ వీడియో కూడా షేర్‌ చేశాడు సోషల్‌ మీడియాలో. సో, రానా ఈజ్‌ పెర్‌ఫెక్ట్‌ అండ్‌ హెల్తీ అనే కదా అర్థం! సోషల్‌ మీడియా లేకపోతే.. రానా స్పందించకపోతే, ఇంకెన్ని దారుణమైన పుకార్లు పుట్టేవో ఏమో. 

మరిన్ని సినిమా కబుర్లు
Number One Chair