Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మూగబోయిన నవ్వుల 'వేణు'వు

no more venu madhav

కన్ను మూస్తే మరణం. కన్ను తెరిస్తే జననం. వచ్చేటప్పుడు ఏమీ పట్టుకురావు. పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవు. పెద్దలు చెప్పే మాటలు ఇవి. కానీ, కన్ను మూసినా, అది మరణం కాదు. పోయేటప్పుడు చాలా తీసుకుపోవచ్చు. అయితే, ఇది చాలా కొద్దిమందికే సాధ్యం. తెరపై కనిపించగానే నవ్వు పుట్టించే కమెడియన్లు కూడా ఏడిపిస్తుంటారు. అవును, వేణు మాధవ్‌ నిజంగానే ఏడిపించాడు. అనారోగ్యంతో కన్ను మూసిన వేణు మాధవ్‌ వెండితెరపై కనిపించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం సంగతి ఎలా ఉన్నా, హఠాన్మరణంతో అందరూ విస్తుపోయేలా చేశాడు.

ఒకటా, రెండా ఆరు వందల సినిమాలు చేశాడు వేణు మాధవ్‌. ఒకానొక దశలో వేణు మాధవ్‌ లేకపోతే సినిమానే లేదు అనే స్థాయికి కొందరు దర్శకులు వచ్చేశారు. ఏమైందో అనూహ్యంగా సినిమాలు తగ్గిపోయాయి అతనికి. అనారోగ్యం పాలయ్యాడని అందరూ అంటోంటే, నాకేంటీ.! చాలా దృఢంగా ఉన్నానంటూ, తనదైన శైలిలో బస్తీమే సవాల్‌ అన్నాడు కొన్నాళ్ల క్రితం. కానీ, అకాల మృత్యువు అతన్ని వెంటాడింది. కాదు, కాదు.. అతని నుండి నవ్వుల భాగ్యం పొందే అవకాశం మనకి లేకుండా చేశారెవరో. వేణు మాధవ్‌ కన్ను మూశాడన్న వార్తను టీవీల్లో తిలకించిన అశేష ప్రజానీకం ఓ కంట బాధతో కన్నీరు పెడితే, అదే సమయంలో ఆయన నటించిన సినిమాల్లోని హాస్యం చూస్తూ నవ్వుల భాష్పాలు విడిచారు. కళాకారుడికి మరణం లేదు. ఆయన నటించిన సినిమాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. నవ్వుల 'వేణు'వు భౌతికంగా మన మధ్య లేడంతే.

మరిన్ని సినిమా కబుర్లు
churaka