ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వారే నయనతార, తమన్నా. మొదట్లో నయనతారనే మెయిన్ లీడ్ హీరోయిన్, తమన్నా జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే అనుకున్నారంతా. కానీ, ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేస్తున్న పోస్టర్లు, ప్రోమోల్లో తమన్నా పాత్ర అతిథి పాత్ర కాదు, ఆమె కూడా ఓ హీరోయినే అని తేలింది. నయనతారతో సమానంగా, కాదు, కాదు నయన్ కన్నా ఎక్కువే అనేలా ఆమె పాత్రను దర్శకుడు ప్రతిబింబించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో తమన్నా పాత్రను నయన తారకు పోటీగా డిజైన్ చేసినట్లు కనిపించింది. అంతేకాదు, ఆ తర్వాత విడుదల చేసిన 'సైరా' టైటిల్ సాంగ్‌లో కూడా తమన్నాకి సంబంధించిన స్టిల్స్‌నే హైలైట్ చేశారు. తమన్నాపై ఓ ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్ కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కత్తులు, కర్రలతో చేసే సాధారణ యాక్షన్ సీన్ కాదది. పొడవాటి దుప్పట్టాతో చాలా నేర్పరిగా చేసే యాక్షన్ అట. 'సైరా'లోని అతి కీలకమైన యాక్షన్ ఘట్టాల్లో ఈ యాక్షన్ సీన్ ప్రత్యేకమైనదట.
ఈ సినిమాలో లక్ష్మి పాత్రలో తమన్నా కనిపించనుంది. 'లక్ష్మీ.. అను నా పేరు ముందు నరసింహా అను మీ పేరివ్వండి చాలు..' అని సైరా నరసింహారెడ్డిని ట్రైలర్‌లో తమన్నా అడిగే సీన్ చాలా చాలా బాగుంది. ఆమె గెటప్ దగ్గర నుండీ, డైలాగులు, అప్పియరెన్స్ అంతా చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే, నయన్ విషయానికి వస్తే, 'సిద్ధమ్మ' పాత్రలో నయన్ నటిస్తోంది. 'సైరా నరసింహారెడ్డి' భార్య పాత్ర అది. ఎప్పటికీ నన్ను విడిచిపెట్టనని మాటివ్వండి అని నయన్ చెబుతోంది. ఇలా డైలాగ్స్ పరంగా చూస్తే, ఇద్దరివీ ఈక్వెల్ పాత్రల్లా అనిపిస్తున్నాయి. అప్పియరెన్స్ విషయానికి వస్తే, నయన్ కన్నా ఒకింత తమన్నాదే ఎక్కువగా అనిపిస్తోంది. ఎవరు ఎక్కువ అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. అక్టోబర్ 2న 'సైరా' వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
|