బన్నీ నటిస్తున్న తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' ఈ సంక్రాంతికి స్లాట్ బుక్ చేసుకుంది. చాలా కాలం తర్వాత సంక్రాంతికి బన్నీ సినిమా విడుదలవుతోంది. ఇక దర్శకుడి వైపు నుండి చూస్తే, సంక్రాంతికి విడుదలైన 'అజ్ఞాతవాసి' నిరాశపరిచింది. మరి ఆ సెంటిమెంట్ రిపీట్ కాకుండా ఉండాలంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాపై చాలా చాలా కసరత్తులు చేసి ఉండాలి. బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. మొదటి రెండు సినిమాలూ సూపర్ హిట్స్ అయ్యాయి. అదే సెంటిమెంట్ కంటిన్యూ అయితే 'అల వైకుంఠపురములో' సూపర్ డూపర్ హిట్ కొట్టాలి. మరోవైపు ఇదే సీజన్‌లో మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్ట్‌గా బన్నీ, మహేష్‌తో ఢీకొట్టబోతున్నాడు తన సినిమాతో. రెండు సినిమాలూ ఎంటర్‌టైనింగ్ ప్రధానంగా తెరకెక్కుతున్నవే. బన్నీ వెనక త్రివిక్రమ్ ఉంటే, మహేష్ వెనక అనిల్ రావిపూడి ఉన్నాడు.
అనిల్‌కి ఈ మధ్య అసలు తిరుగే లేదు. పట్టిందల్లా బంగారమవుతోంది. అనిల్ చేయి పడితే, అది హిట్టే అనే స్థాయికి వచ్చేసింది. అందుకే సుకుమార్‌ని సైతం కాదని, ఏరి కోరి అనిల్ రావిపూడిని ఎంచుకున్నాడు మహేష్. దాంతో బన్నీ ఫ్యాన్స్ చాలా టెన్షన్ ఫీలవుతున్నారట. ఈ సినిమాతో ఎలాగైనా బన్నీ హిట్ కొట్టాలని వారు కోరుకుంటున్నారు. చూడాలి మరి, బన్నీ ఈ సారైనా ఫ్యాన్స్‌ని శాటిస్ ఫై చేస్తాడో.? లేదో.? ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.
|