స్టార్ హీరోయిన్ ఛైర్‌ని అధిరోహించడానికి ఇంకెంతో సమయం లేదు పూజా హెగ్దేకి. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. స్టార్ హీరోలందరికీ పూజానే ఆప్షన్‌గా మారిపోయింది. స్టార్ హీరోయిన్‌గా క్రేజీ ప్రాజెక్టులు అందుకుంటున్న సమయంలోనే 'రంగస్థలం' సినిమా కోసం ఐటెం గాళ్ అవతారమెత్తింది జిగేల్ రాణిగా. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో 'జిల్ జిల్ జిగేల్..' అంటూ మాస్ స్టెప్పులతో ఊపు ఊపేసింది. లేటెస్ట్ మూవీ 'గద్దలకొండ గణేష్'లో శ్రీదేవిగా కనిపించి మరోసారి ఆకట్టుకుంది పూజా హెగ్దే. ఇక త్వరలో అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో'నూ, ప్రబాస్‌తో 'జాన్' సినిమాలతో కవ్వించనుంది. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌లోనూ పూజా హెగ్దే సత్తా చాటనుంది.
గతంలో 'మొహంజోదారో' అనే సినిమాలో నటించింది పూజా హెగ్దే బాలీవుడ్‌లో. కానీ ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేదు. దాంతో లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు 'హౌస్‌ఫుల్ 4' నటిస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా డబుల్ రోల్ పోషిస్తోంది. ఒక పాత్ర కోసం మహరాణి మాలా అవతారమెత్తింది పూజా హెగ్దే. ఈ పాత్ర 1419 కాలం నాటిది. అక్కడ స్టార్ట్ అయిన ఈ స్టోరీ 2019 వరకూ కొనసాగుతుందట. హౌస్‌ఫుల్ సిరీస్‌లో వచ్చిన అన్ని సినిమాలూ మంచి విజయం అందుకున్నాయి. ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. భారీ కాస్టింగ్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, బాబీ డియోల్, కృతికర్భంద, కృతిసనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|