Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-2 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష: ప్రేమ ఇష్క్ కాదల్

prema ishq kaadal movie review

చిత్రం: ప్రేమ ఇష్క్ కాదల్
తారాగణం: హర్షవర్ధన్ రానే, విష్ణు, హరీష్, వితిక, రీతూ వర్మ, శ్రీ ముఖి తదితరులు
ఛాయాగ్రహణం: కార్తీక్
సంగీతం: శ్రవణ్
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
దర్శకత్వం: పవన్ సాధినేని
విడుదల తేదీ: 06/12/2013

క్లుప్తంగా చెప్పాలంటే :
రాయల్ రాజు(శ్రీ విష్ణు) ఒక పల్లెటూరు నుంచి పట్నానికి వస్తాడు. అక్కడ ఒక సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసే సమీర(రీతూ వర్మ) తో ప్రేమలో పడతాడు. సమీరకి సెక్స్ పట్ల బరువైన అభిప్రాయాలు ఏమీ ఉండవు. ఆమె దృష్టిలో అదొక సరదా మాత్రమే. రాయల్ రాజుకు ఆమెతో ప్రేమ ఎలా సాగుతుందనేది ఒక కథ.

మరో పక్క రాండీ(హర్ష వర్ధన్) ఒక గొప్ప గాయకుడు. అనుకోని పరిస్థితులలో అతను సరయు(వితిక) ప్రేమలో పడతాడు. వారిద్దరి మధ్య భావోద్వేగాలు ఎలా సాగుతాయన్నది మరో కథ.

ఇక మూడో జంట అర్జున్(హరీష్), శాంతి(శ్రీ ముఖి). శాంతి తన కెరీర్ కోసం ఎంత దిగజారడానికైనా సిద్ధం. అర్జున్ ఒక విలాస పురుషుడు. వీరిద్దరి మధ్యలో ప్రేమ ఎటుపోతుందనేది మరో కథ.

ఈమూడు కథలు కలిసి ప్రేమ ఇష్క్ కాదల్ గా మన ముందుకొచ్చింది.

మొత్తంగా చెప్పాలంటే :
కొత్త నటుడైన విష్ణు బాగా చేశాడు. అక్కడక్కడా పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్ లను అనుకరించినట్లు కనిపించినా స్వతహాగా అతనిలో స్పార్క్ ఉంది. మరింత సాన బెట్టుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమకు మరొక మాస్ హీరో దొరికినట్టే. హర్ష వర్ధన్ కు పెద్దగా నటించే అవకాశం లేదు. అందుకే మొత్తం సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో కొట్టుకొచ్చేశాడు. తీరా పెర్ ఫార్మెన్స్ చూపించడానికి చాన్స్ వచ్చే టైం కి సినిమా క్లయిమాక్స్ కి వచ్చేసింది. హరీష్ ఒకే. క్లయిమాక్స్ తరువాత నటన బాగుంది. నటీమణులు ముగ్గురూ వారి వారి పరిధిల్లో బాగానే నటించారు.

ఈ సినిమాకి ప్రధానంగా సాంకేతిక విలువలు బాగున్నాయి. పాటల్లో సంగీతం, సాహిత్యం, కెమెరా పనితనం అన్నీ కలిసొచ్చాయి. ఎటొచ్చీ నేపధ్య సంగీతం కూడా బాగుంటే మరింత బాగుండేది. కొత్త వాడైన పవన్ సాధినేని, తన దర్శకత్వ ప్రతిభను బాగానే చూపించాడు. యాతావాతా చెప్పేదేంటంటే ఈ సినిమా అద్భుతం అని అనలేము. అలా అని బాలేదు అని అనలేము. ప్రేక్షకులకి అసంతృప్తి కలగదు.

ఒక్క మాటలో చెప్పాలంటే :
చూడొచ్చు.

అంకెల్లో చెప్పాలంటే : 3/5

 

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Sundeep Kishan