Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cini churaka by cartoonist bannu

ఈ సంచికలో >> సినిమా >>

మాకో హిట్టు కావాలి!

we want hit

'ఘన విజయం సాధిస్తుంది' అని ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న 'రామయ్యా వస్తావయ్యా' సినిమా భారీ పరాజయం పొందడంతో తీవ్ర నిరాశతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పుడు 'నాకో హిట్టు కావాలి!' అని బలంగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే అతని గత చిత్రాలు 'శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్ షా' ఇప్పుడు 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం వరుసగా ఫ్లాప్ కావడంతో ఖచ్చితంగా ఒక హిట్ కావాలి జూనియర్ ఎన్టీఆర్ కి. ఇతనిలాగే చాలామంది హీరోలు ఒకవిజయం కోసం పరితపిస్తున్నారు. ఆ హీరోలు ఎవరంటే -

వెంకటేష్ : 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' సినిమా హిట్ తర్వాత వచ్చిన 'తులసి, చింతకాయల రవి, నమో వెంకటేశా, నాగవల్లి, బాడీగార్డ్, ఈనాడు, షాడో, మసాలా' సినిమాలు ఫ్లాపయ్యాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన మల్టీస్టారర్ సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా విజయం సాధించినప్పటికినీ క్రెడిట్ అంతా మహేష్ బాబుకు వెళ్ళింది.

బాలకృష్ణ : 'లక్ష్మీ నరసింహ' హిట్ తర్వాత వచ్చిన ఏడు సినిమాలు పరాజయం పొందాయి. 'సింహా' విజయం సాధించడమే కాకుండా బాలకృష్ణకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు సైతం వచ్చింది. 'సింహా' సినిమా తర్వాత 'పరమవీరచక్ర, శ్రీ రామరాజ్యం, అధినాయకుడు, శ్రీ మన్నారాయణ, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా' సినిమాలు ఫ్లాపయ్యాయి.

నాగార్జున : 'మన్మధుడు, మాస్, నేనున్నాను, శివమణి, సంతోషం' సినిమాల విజయం తర్వాత వచ్చిన 'కేడి, కింగ్, డాన్, బాస్, రాజన్న, కృష్ణార్జున, షిరిడిసాయి, గ్రీకువీరుడు, భాయ్' సినిమాలు ఒకదాని మించి మరొక ఫ్లాపయ్యాయి. 'రగడ' సినిమా యావరేజ్ హిట్ గా నిల్చింది.

అల్లు అర్జున్ : 'ఆర్య' సినిమా సూపర్ హిట్ తర్వాత వచ్చిన 'బద్రినాథ్, ఆర్య 2, వేదం, వరుడు, ఇద్దరమ్మాయిలతో' సినిమాలు ఫ్లాపయ్యాయి. గత సంవత్సరం వచ్చిన 'జులాయి' ఫర్వాలేదనిపించింది.

తరుణ్ : 'ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను' సినిమాల విజయం తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. 'నిన్నే ఇష్టపడ్డాను, ఒక ఊరిలో, నవ వసంతం, భలేదొంగలు, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, శశిరేఖా పరిణయం, ఇలా వరుసగా ఫ్లాపులు ఉన్నాయి తరుణ్ కి.

సిద్ధార్ధ్ : 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు' సూపర్ హిట్ల తర్వాత వచ్చిన 'ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు, 180, ఓ మై ఫ్రెండ్, ఈ సంవత్సరం వచ్చిన 'జబర్ధస్త్' సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. నిర్మాతగా తీసిన 'లవ్ ఫెయిల్యూర్' పర్వాలేదనిపించింది.

శివాజీ : 'మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా' సినిమాల విజయం తర్వాత 'అదిరిందయ్యా చంద్రం' ఫర్వాలేదనిపించింది. 'కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను, శైలజా కృష్ణమూర్తి, సత్యభామ, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, మా ఆయన చంటిపిల్లాడు, తాజ్ మహల్' (నిర్మాతగా) సినిమాలు పోయాయి.

వరుణ్ సందేశ్ : 'హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం' సినిమాలు వరుసగా వచ్చి సూపర్ హిట్టయ్యాయి. అంతే! ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. 'ఎవరైనా ఎప్పుడైనా, కుర్రాడు, మరో చరిత్ర, హ్యాపీ హ్యాపీగా, ఏమైంది ఈవేళ, కుదిరితే కప్పు కాఫీ, ప్రియుడు, బ్రహ్మిగాడి కథ, చమ్మక్ చల్లో, సరదాగా  అమ్మాయితో, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' వరుసగా ఫ్లాప్ లు. ఇన్ని సినిమాలు పరాజయం పొందినప్పటికీ, కొత్త సినిమా అవకాశాలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం.

కళ్యాణ్ రామ్ : 'తొలి చూపులోనే' తెలుగు ప్రేక్షకులను పలకరించిన కళ్యాణ్ రామ్ 'అభిమన్యు' ఫ్లాపైంది. 'అతనొక్కడే' సూపర్ హిట్టైంది. ఇక వరుసగా వచ్చిన సినిమాలు 'అసాధ్యుడు, విజయ దశమి, లక్ష్మీ కళ్యాణం, హరేరామ్, జయీభవ', ఈ సంవత్సరం వచ్చిన 'ఓం త్రీడీ' ఫ్లాపయ్యాయి.

సుశాంత్ : 'కరెంట్' తో 'కాళిదాసు', 'అడ్డా' ఫ్లాప్.

ఉదయ్ కిరణ్ : 'మనసంతా నువ్వే', 'నీ స్నేహం' విజయాల తర్వాత వచ్చిన 'శ్రీరామ్, జోడి నెం.1, లవ్ టుడే, ఏకలవ్యుడు, వియ్యాలవారి కయ్యాలు, గుండె ఝల్లుమంది, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, జై శ్రీరామ్' వరుసగా అట్టర్ ఫ్లాపయ్యాయి.

తారకరత్న : ఒకేరోజు తొమ్మిది చిత్రాల షూటింగ్ లతో పరిశ్రమ దృష్టిలో పడ్డ తారకరత్న హీరోగా చేసిన 'ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భధ్రాద్రి రాముడు, నందీశ్వరుడు, వెంకటాద్రి' సినిమాలు అట్టర్ ఫ్లాపులు. విలన్ గా చేసిన 'అమరావతి' కూడా ఫ్లాపే. కానీ ఈ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది అవార్డు వచ్చింది.

రాజశేఖర్ : 'గోరింటాకు, మా అన్నయ్య, సింహరాశి' సినిమాలే గత పది సంవత్సరాల్లో రాజశేఖర్ విజయం సాధించిన సినిమాలు. 'విలన్, శేషు, నా స్టైలే వేరు, నాయకుడు, సత్యమేవ జయతే, ఎవడైతే నాకేంటి, మా అన్నయ్య బంగారం' ఇలా వరుసగా వచ్చిన ఫ్లాపులు.

శ్రీకాంత్ : 'ఆపరేషన్ దుర్యోధన, యమగోల మళ్ళీ మొదలైంది, ఖడ్గం,' ఇలా కొన్ని సినిమాలు విజయం సాధించాయి. 'దొంగరాముడు అండ్ పార్టీ, రాధా గోపాళం, స్వరాభిషేకం, లక్కీ, మహాత్మ, విరోధి' ఇలా వరుస ఫ్లాపులు.

రామ్ : 'కందిరీగ' హిట్ తర్వాత వచ్చిన 'గణేష్, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మస్కా, మసాలా సినిమాలు అట్టర్ ఫ్లాపులు.

గోపీచంద్ : 'యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం,' సినిమాలు హిట్టయ్యాయి. ఈ ఏడాది వచ్చిన 'సాహసం' యావరేజి హిట్ గా నిల్చింది. కానీ వరుసగా వచ్చిన 'రారాజు, శంఖం, ఒక్కడున్నాడు, ఒంటరి, గోలీమార్, మొగుడు' పరాజయాలుగా నిలిచాయి.

సుమంత్ : 'సత్యం' హిట్టయితే 'గోదావరి' ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ సాధించింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా విజయం సాధించలేదు సుమంత్ కి. 'ధన 51, గౌరి, పౌరుడు, పెళ్ళి సంబంధం, క్లాస్ మేట్స్, మధుమాసం, గోల్కొండ హై స్కూల్' ఇలా వరుస అట్టర్ ఫ్లాఫ్ లు.

రవితేజ : ఈ ఏడాది వచ్చిన 'బలుపు' హిట్ గా నిలిచింది. కానీ గత చిత్రాలు వరుసగా 'దొంగల ముఠా, వీర, దరువు, సారొచ్చారు, నిప్పు, దేవుడు చేసిన మనుషులు' సినిమాలు అట్టర్ ఫ్లాపులు. ప్రస్తుతం ఇంకో హిట్ కోసం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు రవితేజ.

అల్లరి నరేష్ : 'అహనా పెళ్ళంట, సీమ టపాకాయ్, సుడిగాడు' హిట్ లు కాగా, 'మడత కాజా, సంఘర్షణ, నువ్వా నేనా, కెవ్వు కేక, యాక్షన్ త్రీడీ' ఫ్లాప్ లు అయ్యాయి అల్లరి నరేష్ కు.

వరుసగా 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' సినిమాల ఘన విజయంతో ప్రస్తుతం ఒకింత జాగ్రత్తతో సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. 'ఖుషి' తర్వాత వచ్చిన సినిమాలు అన్ని ఫ్లాపయ్యాయి. 'గబ్బర్ సింగ్' తో హిట్ బాట పట్టాడు (మధ్యలో కెమెరామెన్ గంగతో రాంబాబు అట్టర్ ఫ్లాప్). 'డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి (రెబల్ అట్టర్ ప్లాఫ్) సూపర్ హిట్టులతో ప్రభాస్. ప్రస్తుతం 'బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' సూపర్ హిట్టులతో ప్రస్తుతం 'హార్ట్ ఎటాక్' తో బిజీగా ఉన్నాడు నితిన్. పూరీ జగన్నాథ్ హిట్ ఇస్తాడా లేదా 'హార్ట్ ఎటాక్' ఇస్తాడా అన్నది వేచి చూడాలి.

ఇంకా రాజా, నాగచైతన్య, మంచు మనోజ్, రానా, నాని, రామ్ చరణ్ తేజ్, ఆకాష్... ఇలా చాలామంది హీరోలు ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
rao ramesh