Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
producer nara rohit

ఈ సంచికలో >> సినిమా >>

ముంబైలో ప్రమాదమన్న పోలీసులు

threat in mumbai

ఏంటా ప్రమాదం? ఎవరి నుంచి పొంచి వుంది? అని రామ్‌గోపాల్‌ వర్మకి ‘ముంబైలో థ్రెట్‌’ గురించి చర్చించుకుంటున్నారు అందరూ. కానీ, ఎవరి నుంచి ప్రమాదం పొంచి వుందో అర్థం కావడంలేదు. పోలీసులు వర్మకి ప్రొటెక్షన్‌ ఏర్పాటు చేశారు ముంబైలో. ఇప్పట్లో ముంబైకి రావడం మంచిది కాదని పోలీసులు ఆయనకు సూచించారు కూడా.

దాంతో వర్మ సన్నిహితులు అతన్ని బలవంతంగా హైద్రాబాద్‌కి రప్పించారు. పోలీసుల సూచనతో జాగ్రత్తగా వుండటం మేలని సన్నిహితులు కోరడంతో వర్మ కూడా మరో ఆలోచన లేకుండా ముంబై నుంచి హైద్రాబాద్‌ వచ్చేశారు. వర్మకి ఇదివరకు కూడా బెదిరింపులు వచ్చినా, ఈ సారి బెదిరింపులు కొంచెం తీవ్రంగా వున్నట్లు అర్థమవుతోంది.


ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వర్మ చాలా సినిమాలు రూపొందించారు. అవి మాఫియా వర్గాలకు ఆగ్రహం తెప్పించాయి. కానీ గతంలో లేనంత ప్రమాదం వర్మకి ఇప్పుడే ఎందుకు వుందో ఎవరికీ అర్థం కావడంలేదు. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మకి థ్రెట్‌ రావడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
happy days in ramana gogula