Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
swami vivekananda biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (జనవరి 10 - జనవరి 16) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు పెద్దలయందు భక్తిని కలిగి ఉంటారు, వారి ఆలోచనలను పాటించే ప్రయత్నం చేయండి మంచిది. ఇతరులకు సహాయం చేయాలనే తలంపును కలిగి ఉంటారు. నూతన వస్త్రప్రాప్తిని పొందుతారు, విందులలో పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవచ్చును ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నవి. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు పనిభారం తప్పక పోవచ్చును. ఊహించని ఖర్చులను పొందుతారు, ధనమునకు సంబంధించిన విషయాల్లో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం సూచన. వారం మొత్తంమీద విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది అధికమైన సమయాన్ని కేతాయించుట, ఒకటికి రెండు సార్లు చదువుట అనేది సూచన. ఉన్నత విద్యను అభ్యసించే వారికి కొద్దిగా కష్టకాలమనే చెప్పుకోవాలి, కావున సమయంను వృధాచేయకుండా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. వ్యాపారస్థులకు కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును నూతన ప్రయోగాలు వద్దు. పెద్దల అనుభవాలు అవసరం వారిఆలోచనలు పాటించుట మంచిది. కళారంగంలో ఉన్నవారు పెద్దలఆశిస్శులతో ముందుకు వెళ్తారు మిశ్రమ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి
ఈవారం మీరు ధర్మసంబంధ కార్యక్రమాలలో పాల్గొనుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, నూతన అవకాశాలు పొందుతారు. అధికారులను కలుస్తారు. గత కొంతకాలంగా ఆశిస్తున్న పనులను పూర్తిచేస్తారు. చేపట్టిన పనులలో శ్రమను, పనిభారంను పొందు అవకాశాలు ఉన్నవి. శతృవులు వృద్ది చెందు అవాకాశాలు ఉన్నవి మీ జాగ్రత్తలో మీరు ఉండుట సూచన. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. ఆశించిన ఫలితాలు రాకపోవడం చేత కొంత నిరుత్సాహంను పొందుతారు. వారం మొత్తంమీద విద్యార్థులకు బాగానే ఉంటుంది కాకపోతే వారం ఆరంభంలో చదువును అశ్రద్ద చేసేఆస్కారం ఉంది, కొంత వారిని పట్టించుకోవడం చేత ముందుకు తీసుకువెళ్లవచ్చును. ఉన్నతవిద్య అభ్యసించే వారు కొంత కాలం ఆగక తప్పదు. కొంతమేర కష్టాలు పెరుగుతాయి వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి. వ్యాపారస్థులు నూతన ప్రయత్నాలు చేపడుతారు కొంతవరకు మీ ఆలోచనల్లో సఫలీకృతులు అయ్యేఅవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. కళారంగంలో ఉన్నవారు నూతన అవకాశాలు పొందుతారు వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట వలన లాభిస్తుంది.

మిథున రాశి
ఈవారం మీరు పనుల్లో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగించుటలో విఫలం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త, అధికమైన శ్రద్ధను కలిగిఉండుట మంచిది. బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకపోవడం అనేది సూచన. అనారోగ్యసమస్యలు తప్పకపోవచ్చును కావున జాగ్రతలు తీసుకోవడం ఉత్తమం. మీరు మాట్లాడిన మాటలకు అర్థాలు వేరుగా అవతలివారికి అర్థం అయ్యే ప్రమాదం ఉంది, కావున ఆలోచనల విషయంలో స్పష్టత అవసరం. ధనమునకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు కూడదు. అకారణంగా భయంను పొందుతారు దైవద్యానం మంచిది. ఈవారం మొత్తంమీద విద్యార్ధులకు బాగుంటుంది మంచి ప్రణాళిక ఉన్నచో విజయాలను పొందుతారు. కాంపిటేషన్ రంగంలో రాణిస్తారు నూతన ఆలోచనలు చేయండి. ఉన్నతవిద్య అభ్యసించే వారు కొద్దిగా శ్రమిస్తే చాలు మంచిఫలితాలు పొందుతారు కావున దృష్టిని సారించుట మంచిది. కొద్దిగా శ్రమను పొందుట ద్వార మంచి ఫలితాలు పొందుతారు. కళారంగంలో ఉన్నవారు వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట ద్వారా, మాటలను పొదుపుగా వాడుట వలన మంచిఫలితాలు పొందుతారు ప్రయత్నం చేయండి.

కర్కాటక రాశి
ఈవారం మీరు తలపెట్టిన పనులలో విజయంను పొందుతారు పనులలో ఉత్సాహంను కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. శరీరసౌఖ్యంను పొందుతారు. ఇష్టమైన పనులను చేపడుతారు వాటికి సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును, కావున నిదానంగా వ్యవహరించుట అన్నివిధాలా మంచిది. ప్రయాణాలు చేయుట వలన ఖర్చుపెరుగుతుంది. కుటుంబసభ్యుల మూలాన శ్రమను పొందుటకు అవకాశం ఉంది కావున మనస్పర్థలకు తావివ్వకుండా ఉండుట మంచిది. వారం మొత్తం మీద విద్యార్థులకు బాగుంటుంది చక్కటి ఫలితాలు పొందుతారు. మీ లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నం చేయుట ద్వారా మరిన్ని విజయాలను పొందుతారు. ఉన్నతవిద్యను అభ్యసించే వారు ధనము విషయంలో కొంత ఇబ్బందులు పొందుతారు ఖర్చులు పెరుగుతాయి. కొద్దిగా శ్రమను కలిగి ఉంటారు మంచి ఆలోచనలు అవసరం. కళారంగంలో ఉన్నవారు అనవసరపు వివాదములకు దూరంగా ఉండుట వలన మంచిజరుగుతుంది. చేపట్టు పనులలో నిదానం ఆవసరం. అవకాశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నంలో తొందరపాటు వద్దు.

సింహ రాశి
ఈవారం మీరు చర్చాసంబంధమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. వినోదములలో పాల్గొంటారు. గతంలో చేపట్టిన పనులు పూర్తిఅవుట వలన సంతోషంను పొందుతారు. సేవకుల వలన అలాగే క్రిందిస్థాయి వారినుండి సహాకారం పొందుతారు. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో అనుకున్న దానికన్నా ఎక్కువగా ధనము ఖర్చుఅయ్యే అవకాశం ఉంది. నిర్ణయాల్లో ఒకింత తడబాటు ఉంటుంది కావున స్థిరమైన ఆలోచనలు కలిగిఉండే ప్రయత్నం చేయండి. నూతనప్రయత్నాల ఆరంభించే విషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. వారం మొత్తంమీద విద్యార్ధులకు సంతోషంగా సమయం గడుస్తుంది. సమయాన్ని వినోదాలకు గడిపే అవకాశం ఉంది. పెద్దలతో సమయాన్ని గడుపుతారు వారి సూచనలు పాటించుట మంచిది. ఉనతవిధ్యను అభ్యసించే వారు మాటలు ఇచ్చిపుచుకొనే విషయంలో నిదానం అవసరం తొందరపాటు కూడదు. ఉన్నతప్రణాళికను కలిగి ఉండి ఆ దిశగా అడుగులు ముందుకు వేయండి. స్థిరమైన ఆలోచనలు చేయుట వలన మేలుజరుగుతుంది. కళారంగంలో ఉన్నవారు నూతన అవకాశాలు పొందుతారు. సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం ఉంది.
 

కన్యా రాశి
ఈవారం మీరు చేపట్టిన ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది నిరాశను పొందకండి గట్టి ప్రయత్నం అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో చేయుఆలోచనల్లో తొందరపాటు వద్దు, బాగాఆలోచన చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. కోపంను తగ్గుంచుకొనుట వలన తప్పక మేలుజరుగుతుంది. వివాదములకు దూరంగా ఉండుట సూచన. అకారణంగా తిరగవలసి రావోచ్చును ఓపిక అవసరం. భోజనసౌఖ్యంను పొందుతారు వాటికి ప్రాధాన్యం ఇస్తారు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. ఈవారం మొత్తం మీద విద్యార్ధులకు బాగానే ఉంది. స్వల్ప ప్రయత్నం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి కావున ప్రయత్నం పెంచుట మంచిది. ఉన్నతవిద్యను అభ్యసించే వారికీ అవకాశాలు బాగున్నవి గట్టి ప్రయత్నం చేయుట ద్వారా లాభం కలుగుతుంది. వ్యాపారస్థులకు అవకాశాలు కలుగుతాయి, కాకపోతే ధనమునకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. కళారంగంలో ఉన్నవారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు, అవకాశాలు అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు.

తులా రాశి
ఈవారం మీరు గృహసంబంధమైన విషయాల్లో ఆలోచనలు చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతనఅవకాశలు పొందుటకు అవకాశం ఉంది. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట మంచిది. చేపట్టు పనులలో ఉత్సాహంను కలిగి ఉంటారు. సంతానమూలక సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతనఅవకాశాలు పొందుటకు అవకాశం ఉంది. సంచారం చేయుట వలన ఇబ్బందులు కలుగుతాయి. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం ఉంది, నిదానంగా వ్యవహరించుట మంచిది. వారం మొత్తంమీద విద్యార్ధులకు పెద్దల స్నేహహస్తం అవసరం వారి అవసరాలను కనిపెట్టుకొని ఉండుట వలన మేలుజరుగుతుంది. ఓపికను కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఉన్నతవిద్యను అభ్యసించే వారు మాత్రం ఓపికను కలిగి ఉండి ముందుకు వెళ్ళుట చేత, అలాగే ప్రణాళికాబద్దంగా నడుచుకొనుట చేత మేలుజరుగుతుంది. వ్యాపారస్థులు కొద్దిగా జాగ్రత్తగా నడుచుకోండి పెద్దల సూచనలు పాటించుట చేత మేలుజరుగుతుంది. కళారంగంలో ఉన్నవారు మిశ్రమఫలితాలు పొందుతారు. ప్రతిపనిని ఆలోచించి చేయుట ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు.


వృశ్చిక రాశి
ఈవారం మీరు ప్రయత్నాలలో విజయంను పొందుతారు. మనోదైర్యంను కలిగి ఉంటారు, పనులలో ముందుకు వెళ్ళుప్రయత్నాలు చేయుట కలిసివస్తాయి. అధికారుల వలన పనిభారంను పొందుతారు ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. చోరులవలన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. స్నేహం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. అనుకోనిఖర్చులు పొందుతారు వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వారం మొత్తంమీద విద్యార్థులకు చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. చదువుకు సంబంధించిన విషయంలో శ్రద్ధనుకలిగి ఉండుట మేలుచేస్తుంది. ఉన్నత విధ్యనభ్యసించే వారు అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది, కాకపోతే కొంత కాలం వేచి ఉండక తప్పదు. వ్యాపారస్థులు నూతనఅవకాశాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఆశించిన ఫలితాలు రావడం చేత సంతోషంను పొందుతారు. కళారంగంలో ఉన్నవారు చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఆర్థికపరమైన లాభాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం ఉంది.

ధనస్సు రాశి
ఈవారం మీరు ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి. క్రయవిక్రయముల వలన లాభంను పొందుతారు. రాజకీయవ్యవహారాల్లో పాల్గొనాలనే ఆసక్తిని కలిగి ఉంటారు వాటికి సమయాన్ని గడుపుతారు. స్త్రీ / పురుష సౌఖ్యంను పొందుతారు. సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. స్థానచలనం కలుగుటకు ఆస్కారం ఉంది. వారం మొత్తంమీద విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. విద్యాసంబంధమైన విషయాల్లో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఉన్నతవిధ్యను అభ్యసించే వారు సర్దుబాటు విధానం కలిగి ఉండుట అనేది సూచన. చిన్న చిన్న ఆటంకాలు కలుగుట వలన నిరుత్సాహంను పొందుతారు. ధనమునకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చును. వ్యాపారస్థులు మిత్రులను కలిసి నూతన ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులలో కొంత లాభం పొందుతారు. కళారంగంలో ఉన్నవారికి నూతన పరిచయాలు కలుగుతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు.

మకర రాశి
ఈవారం మీరు అధికారుల మూలాన ఇబ్బందులు పొందుతారు. వివాదములకు దూరంగా ఉండుట సూచన. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండుట సూచన తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తరుచూప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, వాటిమూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. అనేకరూపములుగా ధనవ్యయం పొందుతారు. మరొకప్రదేశంలో నివసించవలసి రావొచ్చును. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట అనేది సూచన. స్నేహితుల మూలాన కష్టములు కలుగుతాయి. వారం మొత్తంమీద విధ్యార్థులకు ఉన్నతమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. మంచి లక్ష్యాలను కలిగి ఉండి ముందుకు వెళ్ళినచో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి ఫలితాలు బాగాశ్రమిస్తే గాని రావు. నూతన ప్రయత్నాలు ఆరంభించాలనే తలంపును కలిగి ఉంటారు.  వ్యాపారస్థులు కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నం ఆరంభిస్తారు. ఆశించిన పనులు వారం మధ్యలో పూర్తిఅవుతాయి ఆరంభంలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి. కళారంగంలో ఉన్నవారికి ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ప్రయాణాలు చేయకండి.


కుంభ రాశి
ఈవారం మీరు ఆర్థికపరమైన విషయల్లో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో మీరు ఆశించిన మార్పులు వచ్చుటకు అవకాశం ఉంది. గతంలోచేపట్టిన పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభించేముందు బాగాఆలోచించే ముందుకు వెళ్ళుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఋణముల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. తలపెట్టిన పనులను అనుకున్న సమయనికి పూర్తిచేసే అవకాశం ఉంది. శుభకార్యములలో పాల్గొనే అవకాశం ఉంది, మధురపదార్ధములను భుజించే అవకాశం ఉంది. వారం మొత్తంమీద విద్యార్థులకు బాగుంటుంది మంచి గుర్తింపును పొందుతారు. ఆశించిన ఫలితాలు కలుగుతాయి. పోటీలలో బహుమతులను పొందు అవకాశం ఉంది. ఉన్నతవిధ్యను అభ్యసించే వారు పెద్దల సలహాలతో మంచి ఫలితాలు పొందుతారు. కాంపిటేషన్లలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్థులకు కొంత లాభం ఉంటుంది అదేవిధంగా చేపట్టిన పనులలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పెద్దల సహాకారం ఉంటే లాభం వస్తుంది. కళారంగంలో ఉన్నవారు సమయాన్ని కుటుంభసభ్యులతో విందులు, వినోదాల కోసం కేటాయించే అవకాశం ఉంది.

మీన రాశి
ఈవారం మీరు పనులను చేపట్టుట యందు విజయంను పొందుతారు. నూతన ప్రయత్నాలను ఆరంభిస్తారు. స్థిరమైన ఆలోచనలు చేయుటకు ప్రయత్నం చేయండి. పనిభారంను పొందుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు. శుభాకార్యములలో పాల్గొంటారు, కుటుంబంలో మంచి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఒకవార్తమాత్రం కొంత బాధకు గురిచేసే అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వారం మొత్తంమీద విధ్యార్థులకు సంబంధించిన విషయాల్లో వారి ఆరోగ్యంను అశ్రద్ధ చేయకపోవడం సూచన. ముఖ్యమైన పనులను వాయిదవేయుట ఉత్తమం. ఉన్నతవిద్యను అభ్యసించే వారికి మాత్రం అకారణంగా తిరగవలసి రావొచ్చును, చికాకును పొందు అవకాశం ఉంది. పనులలో తడబాటు ఉంటుంది. నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట ఉత్తమం. వ్యాపారస్థులకు లాభం ఉంటుంది. నలుగురిలో మంచి పేరును కలిగి ఉంటారు. ఆశించిన పనులు పూర్తిఅవుతాయి. ఆర్థికపరమైన లాభంను పొందుతారు. కళారంగంలో ఉన్నవారు పనిఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. నూతన అవకాశాల కోసం చేయు ప్రయత్నాలు లభిస్తాయి. మాటలను పొదుపుగా వాడుట ఉత్తమం.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Book Review - alalette adugulu