Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

క్యాప్సికం రైస్ - పి. శ్రీనివాసు

కావలసిన పదార్థాలు:
కాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ చెక్క

తయారు చేయు విధానం:
ముందుగా బాణిలో నూనె పోసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వెయ్యాలి. ఉల్లిపాయలు వేగుతుండగానే కరివేపాకు, కాప్సికం ముక్కలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత దానిలో పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి, మగ్గీ దాకా మూతపెట్టుకోవాలి. కొంచెం ఉడకగానే ఇందులో కొంచెం నిమ్మరసం వేయాలి. తరువాత దీనిలో రైస్ వేసి అటు, ఇటు అన్నంకి పట్టేటట్టు తిప్పాలి. కలుపుకుంటూ చూసుకుని కొంచెం అన్నం పడితే వేసుకోవచ్చు. దానిపై కొంచెం కొత్తిమీర వేసి వేడి వేడిగా దించితే కాప్సికం రైస్ రెడీ.

 

మరిన్ని శీర్షికలు