Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

వెండితెర జాబిలి అంజలి

anjali

కొన్ని పాత్రలు ఆయా తారల్ని సజీవంగా ఉంచుతాయి ఎప్పటికీ. అలాంటి పాత్రే సీతాదేవి పాత్ర. ‘లవకుశ’ సినిమాలో సీతాదేవి పాత్రను ఎప్పటికీ మర్చిపోలేరెవరూ. ఆ సీతాదేవి అంజలీదేవి ఇప్పుడు మన మధ్య లేరు. ఇటీవలే కాలం చెందారు అంజలీదేవి. అంజలీ దేవి లేకపోయినా ఆమె నటించిన ‘లవకుశ’ ఎప్పటికీ తెలుగువారిని అలరిస్తూనే ఉంటుంది.

సీతాదేవి పాత్రలోనే కాదు ప్రహ్లాదుడి తల్లిగా కూడా అద్భుతమైన నటన ప్రదర్శించారు అంజలీదేవి. కథానాయిక అన్న పదానికి అసలు సిసలు అర్థం చెప్పిన అంజలీదేవి, సుమారు 500 చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకులను రంజింపజేశారు. కొందరు హీరోల పక్కన కథానాయికగా నటించి, అదే హీరోలకు తల్లిగానూ ఆమె నటించారు.

‘అమ్మ’ అని ఆమె తర్వాతి తరం నటీమణులతో పిలిపించుకున్న అంజలీ దేవి మనమధ్య లేరన్న విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వెండితెర జాబిలిగా అంజలీదేవిని కీర్తిస్తున్నది సినీ పరిశ్రమ. కమిట్‌మెంట్‌కి నిదర్శనం అంజలీ దేవి అని కొనియాడుతున్నారు ఆమె సన్నిహితులు, ఆమెతో పనిచేసిన సినీ ప్రముఖులు.

మరిన్ని సినిమా కబుర్లు
30 years of vennello godaari andam