Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akkada ikkada

ఈ సంచికలో >> సినిమా >>

శృంగార విద్య

srungara vidya

‘డర్టీపిక్చర్‌’ సినిమాకి ముందు కూడా విద్యాబాలన్‌ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ‘డర్టీపిక్చర్‌’ సినిమా ఆమె కెరీర్‌ని కొత్త మలుపు తిప్పింది. బాలీవుడ్‌లో విద్యాబాలన్‌ ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది ‘డర్టీపిక్చర్‌’ సినిమాతో. ఆ సినిమాలో ఎక్స్‌పోజింగ్‌ బాగా చేసినప్పటికీ, ఆమెలో నటినే ఆరాధించారు ప్రేక్షకాభిమానులు.

గ్లామర్‌ ప్రదర్శన ఎలాగున్నా దానికి నటన అనే అందమైన కోటింగ్‌ వేస్తేనే హీరోయిన్‌ ఇమేజ్‌ పెరుగుతుందనడానికి ‘డర్టీపిక్చర్‌’ ఓ నిదర్శనం. తద్వారా విద్యాబాలన్‌ మిగతా హీరోయిన్లకు భిన్నమనే పేరు తెచ్చుకుంది. అదలా ఉంచినట్లయితే పెళ్ళయిన తరువాత కూడా విద్యాబాలన్‌ గ్లామరస్‌ క్వీన్‌గా వెలిగిపోతోంది.

బాలీవుడ్‌లో క్యాలెండర్‌ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది డబ్బూ రత్నానీ పేరే. డబ్బూరత్నానీ క్యాలెండర్‌ కోసం విద్యాబాలన్‌ ఇచ్చిన పోజు యువతరంలో హీట్‌ని పెంచుతున్నది. చాలా గ్లామరస్‌గా ఉన్న ఈ ఫొటోకి బాలీవుడ్‌ ప్రముఖులూ ఫిదా అవుతున్నారు. వయసు మీద పడ్డానికీ, గ్లామర్‌కీ సంబంధం లేదని, గ్లామరస్‌గా ఉంటే ఎక్స్‌పోజింగ్‌ ఎబ్బెట్టుగా ఉండదని విద్యాబాలన్‌ మాత్రమే కాదు, బాలీవుడ్‌లోనూ అందరూ ఒప్పుకుంటున్నారు. డబ్బూ రత్నానీ స్పెషల్‌ ‘శృంగార విద్య’ను మీరూ ఆస్వాదించండి.

మరిన్ని సినిమా కబుర్లు
superstar kidnap